The RajaSaab Day 2 Box Office: 150 కోట్ల క్లబ్‌లో రాజాసాబ్.. ప్రభాస్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? రెండో రోజు సాధించిన కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేసిన ఈ సినిమాకు ఖర్చు కూడా భారీగానే అయింది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, భారీ సెట్లు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సుమారుగా 400 కోట్లకుపైగా బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 207 కోట్ల మేర వాల్యూ చేశారు. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు నెట్, 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 900 నుంచి 950 స్క్రీన్ల నుంచి వరకు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 600 స్క్రీన్ల మేర రిలీజ్ చేశారు. నార్త్ ఇండియాలో 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 550 లోకేషన్లలో సినిమాను ప్రదర్శించారు. దాంతో ఈ సినిమాను 4500 నుంచి 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం, కంటెంట్ పరంగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయినా.. ప్రభాస్ స్టామినా కారణంగా ఈ సినిమా రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 112 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్ కెరీర్‌లో ఇది అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది అని పేర్కొంటున్నారు.
ఇక ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 45 కోట్ల నెట్, 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాంలో 16 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 29 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, కేరళ, తమిళనాడులో 1.75 కోట్ల రూపాయలు, హిందీలో 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 18 కోట్ల రూపాయలు రాబట్టింది.
ది రాజాసాబ్ సినిమా తొలి రోజుతో పోల్చుకొంటే రెండో రోజు సుమారుగా 50 శాతం డ్రాప్ కనిపించింది. ఈ చిత్రం తెలుగులో 25 కోట్ల నెట్, 50 కోట్ల రూపాయల గ్రాస్, హిందీలో 6 కోట్ల నెట్ 10 కోట్ల గ్రాస్, కన్నడలో 3 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 50 లక్షలు, కేరళలో 8 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 34 కోట్ల రూపాయల నెట్, 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది . ఇక నార్త్ అమెరికాలో 250K డాలర్లు అంటే 2.25 కోట్ల రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 62.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో రెండు రోజుల్లో 170 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్‌గా వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా భారీగా వసూళ్లను సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











