The Rajasaab Day 2 Collections: నెగెటివ్ టాక్ లోనూ రాజా సాబ్ కలెక్షన్ల జోరు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas)నటించిన భారీ బడ్జెట్ సినిమా ది రాజాసాబ్ (The Raja Saab)విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కల్కి (Kalki 2898 AD)తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యంగ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హారర్-ఫాంటసీ-కామెడీ జానర్‌లో రూపొందించగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు నిర్మించారు.
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. జనవరి 8న ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ రేస్ ప్రారంభించిన రాజాసాబ్, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్న ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ రెండోవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే...

స్టార్ క్యాస్ట్, టెక్నికల్
ది రాజాసాబ్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటించారు. బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, యోగి బాబు, సప్తగిరి వంటి పెద్ద క్యాస్ట్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించగా, తమన్ సంగీతం ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
బడ్జెట్, బ్రేక్ ఈవెన్ లెక్కలు
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ట్రేడ్ అంచనా. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రా-నైజాం రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు మేర డీల్స్ జరిగాయి. ఓవర్సీస్ హక్కులు సుమారు రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా సినిమా ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.250 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన థియేటర్లలో లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిన అవసరం ఉందని అంచనా.
ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్
ఓవర్సీస్‌లో సినిమాను ప్రతంగిరా మూవీస్ విడుదల చేసింది. అక్కడ బ్రేక్ ఈవెన్‌కి మొత్తం 10 మిలియన్ డాలర్లు (రూ.90 కోట్లు), నార్త్ అమెరికాలో మాత్రమే 7.5 మిలియన్ డాలర్లు (రూ.68 కోట్లు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ దశలోనే ది రాజాసాబ్ ఓవర్సీస్ మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంటర్ కావడం విశేషం. ఇలా ప్రీ సేల్స్‌తోనే ఈ మార్క్‌ను చేరుకోవడం ప్రభాస్‌కు ఇది మూడోసారి. గతంలో సలార్ 1, కల్కి 2898 ఏడీ కూడా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్‌ను దాటాయి.
ది రాజాసాబ్ ఓపెనింగ్ కలెక్షన్స్
ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్, నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పూర్తిగా ప్రభాస్ స్టార్‌డమ్‌ను ప్రతిబింబించాయి. ట్రేడ్ వర్గాలు ప్రకారం... తొలి రోజు ఇండియా నెట్ సుమారు ₹45 కోట్లు కాగా, ప్రీమియర్స్, పెయిడ్ ప్రివ్యూస్‌ను కలుపుకుంటే ఈ సంఖ్య రూ.54.15 కోట్ల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇండియా గ్రాస్ రూ. 62-65 కోట్ల మధ్య ఉండగా.. వరల్డ్‌వైడ్ గ్రాస్ మాత్రం రూ. 100 కోట్ల మార్క్‌ను చేరినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సైతం ప్రభాస్ సినిమా షేక్ చేసింది. దాదాపు రూ.26కోట్ల గ్రాస్ (డాలర్లలో చూస్తే 2.5 మిలియన్ డాలర్లు) నమోదు చేసింది.
ఇదిలా ఉంటే.. మూవీ మేకర్స్ పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే.. ప్రభాస్ కెరీర్‌లో ఇది ఆరోసారి రూ 100 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అదే సమయంలో ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే, ఓపెనింగ్ డేలోనే కొన్ని తాజా సినిమాలను వెనక్కి నెట్టి ముందుకు రావడం ప్రభాస్ మార్కెట్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల నుంచే భారీ రెస్పాన్స్ రావడం, డే 1లో తెలుగు నెట్ ఒక్కటే రూ,45 కోట్లకు పైగా రావడం ప్రభాస్ స్టార్ పవర్‌కు నిదర్శనం.
ఇదిలా ఉంటే.. రెండో రోజు నుంచే పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. తొలి రోజు అడ్వాన్స్ బుక్సింగ్ వల్ల భారీ కలెక్షన్స్ వచ్చిన మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది. డే 2లో ఆక్యుపెన్సీ భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. సాక్‌నిల్క్ లైవ్ డేటా ప్రకారం తెలుగు ఆక్యుపెన్సీ సుమారు 30 శాతం వరకు మాత్రమే ఉండగా, హిందీ మార్కెట్‌లో ఇది మరింత తక్కువగా 13 శాతానికి పరిమితమైంది. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే, సినిమా రెండో రోజు భారీ డ్రాప్‌ను ఎదుర్కొన్నట్టే అనిపిస్తోంది.
ఈ ఆక్యుపెన్సీ లెక్కలను ఆధారంగా తీసుకుని ట్రేడ్ అంచనాలు వేస్తే, రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు రూ. 40 కోట్ల వరకు, ఇండియా గ్రాస్ రూ. 47 కోట్లకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా తొలి రోజు స్థాయిలో కాకపోయినా, రూ.19 నుంచి రూ.20 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని అంచనా. ఈ లెక్కన చూస్తే, రెండో రోజు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 66 నుంచి రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ అంచనాలను రెండు రోజుల మొత్తం కలెక్షన్స్‌కు కలిపి చూస్తే ది రాజాసాబ్ రెండు రోజుల్లో ఇండియా నెట్ సుమారు రూ. 103 కోట్లకు, ఇండియా గ్రాస్ దాదాపు రూ.122 కోట్లకు , ఓవర్సీస్ కలెక్షన్స్ సుమారు రూ. 45 కోట్లకు చేరే అవకాశముంది. మొత్తం మీద వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రూ.167 నుంచి రూ. 170 కోట్ల మధ్యలో ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎర్లీ ట్రేడ్ ఎస్టిమేట్స్ మాత్రమేనని, తుది లెక్కలు వచ్చాక పూర్తి స్పష్టత వస్తుంది.
మొత్తంగా చూస్తే, రాజాసాబ్* బాక్సాఫీస్ ప్రయాణంలో తొలి రోజు పూర్తిగా ప్రభాస్ స్టార్ పవర్ ప్రభావం కనిపించగా, రెండో రోజు నుంచి కంటెంట్, టాక్ ప్రభావం మొదలైనట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు అసలైన పరీక్ష వీకెండ్, సంక్రాంతి హాలిడేస్. ఈ పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎంతవరకు పికప్ వస్తుందన్నదే సినిమా లాంగ్ రన్‌ను నిర్ణయించనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











