The Rajasaab Day 3 Collections: ది రాజా సాబ్ కు ఊహించని కలెక్షన్స్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ది రాజాసాబ్ విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కల్కి (Kalki 2898 AD)తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 8న ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ రేస్ ప్రారంభించిన రాజాసాబ్, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్న ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే...
ఇక రాజాసాబ్ తారాగణం పరంగా చూస్తే.. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు నిర్మించారు. సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు చేపట్టారు. ఎస్ . థమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఇక బడ్జెట్ విషయానికి వస్తే, నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల ఖర్చులు, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీ వ్యయాలతో కలిపి ది రాజాసాబ్ సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ పరంగా ఆంధ్రా-నైజాం రైట్స్‌కు రూ.120 కోట్లు, హిందీ రైట్స్‌కు రూ.30 కోట్లు, తమిళానికి రూ.8 కోట్లు, కర్ణాటకకు రూ.15 కోట్లు, కేరళకు రూ.4 కోట్లు చొప్పున డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా సుమారు రూ.80 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం మీద ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ కట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా సేఫ్ కావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమని అంచనా.
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి. అక్కడ లాభాల్లోకి రావాలంటే సుమారు 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ అవసరం. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.68 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ది రాజాసాబ్ కలెక్షన్స్
ది రాజాసాబ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్స్‌తో సినిమా రూ.9.15 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.53.75 కోట్లు, రెండో రోజు రూ.27.83 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఇండియాలో మొత్తం రూ.90.73 కోట్ల నెట్, సుమారు రూ.108.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో రూ.78.68 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.11.2 కోట్లు, తమిళనాడులో రూ.55 లక్షలు, కర్ణాటకలో రూ.16 లక్షలు, మలయాళంలో రూ.14 లక్షలు వసూలైనట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.
ఇక మూడో రోజు రాజాసాబ్ (మొదటి ఆదివారం) వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే చెప్పాలి. నెగిటివ్ టాక్ వల్ల వసులు క్రమంగా పడిపోతున్నాయి. తొలిరోజు కంటే రెండో రోజు పడిపోయాయి. అలాగే, మూడు రోజు థియేటర్ ఆక్యూపెన్సీ తగ్గడం, కలెక్షన్స్ లో తగ్గుదల కనిపించడం చూడవచ్చు. ప్రస్తుతం నమోదైన థియేటర్ ఆక్యూపెన్సీ ప్రకారం.. 25 కోట్లు వరకు నెట్ కలెక్షన్స్, 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశముందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. తొలి మూడు రోజుల కలెక్షన్స్ కలిపి దిరాజాసాబ్ సినిమా మొత్తం రూ. 115 కోట్ల నెట్ కలెక్షన్, 148 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 10 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఓపెనింగ్ డేలో భారీ రికార్డులు నమోదు చేసినప్పటికీ, రెండో రోజు నుంచి వచ్చిన డ్రాప్ కారణంగా వీకెండ్ మొత్తం వసూళ్లపై ప్రభావం పడినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్ ముగిసేలోపు, పండుగ సెలవుల ప్రభావంతో మరింత పుంజుకునే అవకాశముందని, బాక్సాఫీస్ రేసులో ముందంజలో నిలిపాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











