The Rajasaab Day 4 Collections: ది రాజాసాబ్‌పై మన శంకర వరప్రసాద్ గారు ఎఫెక్ట్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన భారీ బడ్జెట్ చిత్రం ది రాజాసాబ్ (The Raja Saab)విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 8న ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ రేస్ ప్రారంభించిన రాజాసాబ్, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తొలి రోజు సినిమా మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. ఇక నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు విడుదల కావడంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ నేపథ్యంలో వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ నాలుగవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే...
పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్ తారాగణం, బిజినెస్ వివరాలు చూస్తే ఇది ఎంత భారీ ప్రాజెక్టో అర్థమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా నిర్మించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఎస్. థమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

బడ్జెట్ విషయానికి వస్తే.., భారీ తారాగణం, టెక్నికల్ టీమ్, ప్రొడక్షన్ విలువలు, పబ్లిసిటీ ఖర్చులు కలిపి 'ది రాజాసాబ్' బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్‌లో ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా సుమారు రూ.80 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్. మొత్తంగా ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ ఉందని సమాచారం.
ఈ లెక్కల ప్రకారం సినిమా సేఫ్ కావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమని ట్రేడ్ అంచనా. ఓవర్సీస్ మార్కెట్‌లో లాభాల్లోకి రావాలంటే దాదాపు 10 మిలియన్ డాలర్లు (రూ.90 కోట్లు) గ్రాస్ కలెక్షన్లు అవసరం కాగా, నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కోసం మాత్రమే 7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.68 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ది రాజాసాబ్ కలెక్షన్స్
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రీమియర్ షోలతోనే 'ది రాజాసాబ్' మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ప్రీమియర్ డే (గురువారం) రోజున ఇండియా నెట్‌గా సుమారు రూ.9.15 కోట్ల వసూళ్లు సాధించగా, ఓవర్సీర్ కలెక్షన్లతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.11 కోట్లకు చేరినట్లు అంచనా. ఇక తొలి రోజు (శుక్రవారం) సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చింది. ఇండియా నెట్ రూ.53.75 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.64.62 కోట్లు వసూలు కాగా, ఓవర్సీస్ నుంచి రూ.25 కోట్లు రావడంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ మొత్తం రూ.89.62 కోట్లకు చేరింది. నెగిటివ్ టాక్ లో కూడా ఈ రేంజ్ లో రాయడం చూస్తే.. ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించబడిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక రెండో రోజు (శనివారం) మిక్స్‌డ్ టాక్ ప్రభావం కొంత కనిపించినప్పటికీ, కలెక్షన్లు గౌరవప్రదంగానే కొనసాగాయి. ఇండియా నెట్ రూ.26 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.31.26 కోట్లు రాగా, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలయ్యాయి. దీంతో రెండో రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.36.26 కోట్లుగా నమోదైంది. ఇక మూడో రోజు (ఆదివారం) రఫ్ డేటా ప్రకారం ఇండియా నెట్ రూ.19.10 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.22.96 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ నుంచి రూ.3.67 కోట్లు రావడంతో, ఆ రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.26.63 కోట్లుగా ట్రేడ్ అంచనా వేస్తోంది. వీకెండ్ ముగిసే సరికి సినిమా స్థిరమైన కలెక్షన్లు సాధించినట్టు బాక్సాఫీస్ వర్గాలు అంటున్నాయి.
అయితే.. నేటీ నుంచి (సోమవారం) ది రాజా సాబ్ సినిమాకు పోటీగా చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారు ' మూవీ రాబోతుంది. ఈ మూవీకి ప్రిమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇటు ఇండియా బాక్సాఫీస్ వద్ద, అటు ఓవర్సీస్ లో కూడా గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కొంత తగ్గే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం ఇండియా నెట్ రూ.12 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.14.43 కోట్లు, ఓవర్సీస్ రూ.2.31 కోట్లు వసూలయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో నాలుగో రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ సుమారు రూ.16.74 కోట్లుగా ఉండొచ్చని అంచనా.
ఇక ఈ నాలుగు రోజుల మొత్తంగా చూస్తే, 'ది రాజాసాబ్' వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.180.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇండియా నెట్ మొత్తం రూ.120 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.144.27 కోట్లు, ఓవర్సీస్ రూ.35.98 కోట్లుగా నమోదయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే.. మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్, వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి 'ది రాజాసాబ్'కు భారీ ఓపెనింగ్‌ను అందించాయి. ఇక నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలోకి రావడంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ రేస్ ఎలా సాగుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











