The Rajasaab Day 5 Collections: ది రాజాసాబ్‌కి భారీ షాక్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab). ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'కల్కి 2898 AD' తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ, తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. అయితే ప్రభాస్ క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ అందుకున్నాయి. అయితే.. నిన్న మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదలవగా, నేడు మాస్ మహారాజా రవితేజ 'భక్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ ఐదవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..
పాన్ ఇండియా మూవీ అయిన 'ది రాజాసాబ్' తారాగణం, బిజినెస్ వివరాలు చూస్తే ఇది ఎంత భారీ ప్రాజెక్టో అర్థమవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా నిర్మించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఎస్. థమన్ సంగీతం సినిమాకు బలంగా మారాయి.

బడ్జెట్ విషయానికి వస్తే.. 'ది రాజాసాబ్'లో భారీ తారాగణం, టెక్నికల్ టీమ్, హై ప్రొడక్షన్ వాల్యూస్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ పరంగా ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా సుమారు రూ.80 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.
మొత్తంగా ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 'ది రాజాసాబ్' సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో లాభాల్లోకి రావాలంటే దాదాపు 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) గ్రాస్ కలెక్షన్లు అవసరమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 7.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.68 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
ది రాజాసాబ్ కలెక్షన్స్
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రీమియర్ షోల నుంచే 'ది రాజాసాబ్' స్ట్రాంగ్ కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రీమియర్ల ద్వారా ఇండియాలో రూ.9.15 కోట్ల నెట్, రూ.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా. తొలి రోజు శుక్రవారం సినిమా అసలైన స్టామినా చూపించింది. ఇండియా నెట్‌గా రూ.53.75 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.64.62 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు రాబట్టి వరల్డ్‌వైడ్‌గా ఒక్క రోజే దాదాపు రూ.89.62 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది ప్రభాస్ క్రేజ్‌కు మరోసారి నిదర్శనంగా నిలిచింది. ఇక రెండో రోజు శనివారం కూడా కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇండియా నెట్‌గా రూ.26 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.31.26 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.5 కోట్ల వసూళ్లు వచ్చాయి.
దీంతో రెండో రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.36.26 కోట్లుగా నమోదైంది. ఆదివారం మంచి ఆక్యుపెన్సీలతో సినిమా పరుగులు పెట్టింది. మూడో రోజు ఇండియా నెట్ రూ.19.10 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.22.96 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ నుంచి రూ.3.67 కోట్లు రావడంతో ఆదివారం వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.26.63 కోట్లుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.వీక్‌డే ప్రభావం కనిపించినా, సోమవారం కూడా 'ది రాజాసాబ్' ఆశించిన స్థాయిలో నిలబడింది. నాలుగో రోజు ఇండియా నెట్‌గా సుమారు రూ.6.6 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.7.93 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఓవర్సీస్‌లో రూ.1.27 కోట్లు రావడంతో సోమవారం వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.9.2 కోట్లుగా నమోదైంది.
ఇక ఐదో రోజు మంగళవారం కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు అంచనాలు వెల్లడించాయి. ఇండియా నెట్ రూ.7 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.8.41 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.35 కోట్లు వసూలు చేసి, ఐదో రోజు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.9.76 కోట్ల గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలన్నింటిని కలిపితే, ఐదు రోజుల్లో 'ది రాజాసాబ్' మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు దాదాపు రూ.182.47 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియా నెట్‌గా రూ.121.6 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.146.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.36.29 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా, మూవీ మేకర్స్ మాత్రం మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు. సినిమా రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని అధికారికంగా ప్రకటించారు. 200 కోట్ల మార్క్‌ను నాలుగు రోజుల్లోనే టచ్ చేయడం 'రాజాసాబ్' జెన్యూన్ సక్సెస్‌కు నిదర్శనంగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిసెంట్‌గా యాడ్ చేసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ పై మూవీ మేకర్స్ అంచనాలు పెట్టుకున్నారు.
మరోవైపు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే రన్ అవుతున్న ది రాజాసాబ్ కు ఎదురుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు', మాస్ మహారాజా రవితేజ నటించిన 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' విడుదల కావడంతో థియేటర్ల వద్ద హీట్ వాతావరణం నెలకొంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మాస్ ప్రేక్షకులు విడివిడిగా ఈ సినిమాలవైపు మళ్లడంతో స్క్రీన్లు, షోలు విభజనకు గురవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిక్స్‌డ్ టాక్‌తో సాగుతున్న 'ది రాజాసాబ్' కలెక్షన్లు తొలి రోజులంత కలెక్షన్లు కొనసాగడం కష్టమని, పోటీ ప్రభావంతో రోజువారీ వసూళ్లు క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











