The Rajasaab Day 6 Collections: షాకింగ్‌గా ది రాజాసాబ్ కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ సినిమా 'ది రాజాసాబ్'(The Raja Saab) బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పరిస్థితుల్లో కొనసాగుతోంది. 'కల్కి 2898 AD' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే నమోదయ్యాయి. పాన్ ఇండియా మార్కెట్‌లో, ముఖ్యంగా నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్‌లో అభిమానుల స్పందన బలంగా కనిపించింది.
అయితే సంక్రాంతి సీజన్ రావడంతో బాక్సాఫీస్ పోరు మరింత హీటెక్కింది. మొన్న మెగాస్టార్ చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారు' ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. నిన్న మాస్ మహారాజా రవితేజ నటించిన భక్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్లలోకి రావడంతో మాస్ సెంటర్లలో పోటీ పెరిగింది. నేడు యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కూడా విడుదల కావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో థియేటర్ల విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుస రిలీజ్‌లతో 'ది రాజాసాబ్'కు గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ ఆరవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..

'ది రాజాసాబ్' కాస్టింగ్, టెక్నికల్ టీమ్ చూస్తే ఇది ఎంత భారీ ప్రాజెక్టో అర్థమవుతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా నిర్మించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఎస్. థమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారింది.
బడ్జెట్ పరంగా చూస్తే, భారీ తారాగణం, హై ప్రొడక్షన్ వాల్యూస్, విస్తృత పబ్లిసిటీ ఖర్చులతో 'ది రాజాసాబ్' సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్‌లో ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా సుమారు రూ.80 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ వాల్యూ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ లెక్కల ప్రకారం 'ది రాజాసాబ్' పూర్తిస్థాయిలో సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో లాభాల్లోకి రావాలంటే దాదాపు 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) గ్రాస్ అవసరమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు 7.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.68 కోట్లు) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ లెక్కలు సూచిస్తున్నాయి.
ఇక కలెక్షన్లు వివరాల్లోకెళ్తే.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రీమియర్ షోల నుంచే 'ది రాజాసాబ్' స్ట్రాంగ్ కలెక్షన్లను సాధించింది. ప్రీమియర్ల ద్వారా ఇండియాలో రూ.9.15 కోట్ల నెట్, రూ.11 కోట్ల ఇండియా గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత ఫస్ట్ డే (శుక్రవారం) ప్రభాస్ స్టామినా పూర్తిస్థాయిలో బయటపడింది. ఒక్క రోజులోనే ఇండియా నెట్ రూ.53.75 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.64.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు వసూలు చేసి, వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.89.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది.
సెకండ్ డే (శనివారం) కొంత డ్రాప్ కనిపించినా కూడా కలెక్షన్లు స్థిరంగానే కొనసాగాయి. ఆ రోజు ఇండియా నెట్ రూ.26 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.31.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసి, వరల్డ్‌వైడ్‌గా రూ.36.26 కోట్ల గ్రాస్ సాధించింది. థర్డ్ డే (ఆదివారం) ఫెస్టివ్ అడ్వాంటేజ్ కలిసి రావడంతో మంచి వసూళ్లు నమోదయ్యాయి. ఇండియా నెట్ రూ.19.10 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.22.96 కోట్లు, ఓవర్సీస్ రూ.3.67 కోట్లు కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.26.63 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
వీక్‌డేస్ ప్రారంభమైనప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం విశేషంగా మారింది. ఫోర్త్ డే (సోమవారం) ఇండియా నెట్ రూ.6.6 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.7.93 కోట్లు, ఓవర్సీస్ రూ.1.27 కోట్లు వసూలు చేసి వరల్డ్‌వైడ్‌గా రూ.9.2 కోట్ల గ్రాస్ సాధించింది. 5వ డే (మంగళవారం) రఫ్ డేటా ప్రకారం ఇండియా నెట్ రూ.4.85 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.5.83 కోట్లు, ఓవర్సీస్ రూ.0.93 కోట్లు కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.6.76 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా.
ఇక ఆరో రోజు (బుధవారం) కలెక్షన్లపై అంచనాలు కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. ఇండియా నెట్ సుమారు రూ.5.50 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.6.61 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.05 కోట్లు వసూలు చేసి, వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.7.66 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం, ఆరు రోజుల్లోనే 'ది రాజాసాబ్' వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ.187.13 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మొత్తంగా చూస్తే, 6 రోజుల్లో ఇండియా నెట్ రూ.124.95 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.150.21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.36.92 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది.
మొన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బలంగా ఆకట్టుకుంటోంది. నిన్న మాస్ మహారాజా రవితేజా మూవీ, నేడు యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రోజు విడుదల కావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ మధ్య థియేటర్ల విభజన మరింత పెరిగింది.
ఈ వరుస రిలీజ్‌ల కారణంగా 'ది రాజాసాబ్'కు స్క్రీన్స్, షో టైమింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.భారీ పోటీ మధ్య కూడా పండుగ సీజన్ అడ్వాంటేజ్, ప్రభాస్ ఫ్యాన్‌బేస్ సపోర్ట్‌తో 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద స్టెడీ రన్ కొనసాగిస్తుందా? లేదా అనే అంశం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











