The Rajasaab Day 7 Collections: పడిపోయిన ‘ది రాజాసాబ్' కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

The Rajasaab Collections: ప్రభాస్ ' ది రాజా సాబ్' బాక్సాఫీస్ రన్ ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీ, 'కల్కి 2898 AD' తర్వాత రావడంతో విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ మాత్రం స్ట్రాంగ్‌గా నమోదయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో అభిమానులను మంచి స్పందన కనిపించింది. ఈ నేపథ్యంలో వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్‌ మూవీ ఏడో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..

అయితే సంక్రాంతి సీజన్ రావడంతో పోటీ ఒక్కసారిగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుండగా, రవితేజ 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' మాస్ సెంటర్లలో ప్రభావం చూపిస్తోంది. అదే సమయంలో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' విడుదల కావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో థియేటర్ల విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుస విడుదలల కారణంగా 'ది రాజాసాబ్'కు స్క్రీన్స్,షో టైమింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

The Rajasaab Day 7 Expected Box Office Collections Worldwide Prabhas s Film Good Start at GBOC

భారీ తారాగణం, టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ ఉన్నట్లు అంచనా. ఆంధ్రా-నైజాం, హిందీ, తమిళం, కర్ణాటక, కేరళతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం సినిమా పూర్తిస్థాయిలో సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే... రాజాసాబ్ విడుదలైన మొదటి వారం పూర్తయ్యే సరికి స్ట్రాంగ్ నంబర్స్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ప్రీమియర్ల ద్వారా ఇండియాలో సుమారు రూ.9.15 కోట్ల నెట్, రూ.11 కోట్ల గ్రాస్ వసూలు కాగా, ఆ వెంటనే వచ్చిన తొలి రోజు ప్రభాస్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది. మిక్స్ డ్ టాక్ వచ్చిన ఫస్ట్ డేనే ఇండియా నెట్ రూ.53.75 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.64.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు రాబట్టి, వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.89.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

రెండో రోజు కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, సినిమా స్థిరంగా రన్ అవుతూనే ఉంది. ఆ రోజు ఇండియా నెట్ రూ.26 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.31.26 కోట్లు, ఓవర్సీస్ రూ.5 కోట్లు కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.36.26 కోట్ల గ్రాస్ రాబట్టింది.
దివారం ఫెస్టివ్ అడ్వాంటేజ్ కలిసి రావడంతో మూడో రోజు కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి. ఇండియా నెట్ రూ.19.10 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.22.96 కోట్లు, ఓవర్సీస్ రూ.3.67 కోట్లు కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.26.63 కోట్ల గ్రాస్ సాధించింది.

వీక్‌డేస్ ప్రారంభమైనా కూడా సినిమా పూర్తిగా కుదేలుకాలేదు. నాలుగో రోజు ఇండియా నెట్ రూ.6.6 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.7.93 కోట్లు, ఓవర్సీస్ రూ.1.27 కోట్లు రాగా, వరల్డ్‌వైడ్‌గా రూ.9.2 కోట్ల గ్రాస్ నమోదైంది. ఐదో రోజు ఇండియా నెట్ రూ.4.85 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.5.83 కోట్లు, ఓవర్సీస్ రూ.0.93 కోట్లు కలిపి దాదాపు రూ.6.76 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఆరో రోజు కూడా కలెక్షన్లు కొంత మెరుగయ్యాయి. ఇండియా నెట్ సుమారు రూ.5.25 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.6.61 కోట్లు, ఓవర్సీస్ రూ.1.05 కోట్లు కలిపి వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.7.66 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఏడో రోజు అంచనాలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇండియా నెట్ దాదాపు రూ.5 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.6.21 కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు రూ.1 కోటి రాబట్టి, వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.7 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం, వారం రోజుల్లోనే 'ది రాజాసాబ్' వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ.194 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు అంచనా. మొత్తం మీద 7 రోజుల్లో ఇండియా నెట్ సుమారు రూ.130 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.157 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.38 కోట్లు వసూలు చేసి ప్రభాస్ సార్ట్ డమ్‌ను మరోసారి చాటింది ఈ సినిమా.

అయితే ఇదే సమయంలో చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్' రవితేజ 'భక్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రోజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' వంటి సినిమాలు థియేటర్లలోకి రావడంతో 'ది రాజాసాబ్'కు స్క్రీన్స్, షో టైమింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, పండుగ సీజన్ అడ్వాంటేజ్‌, ప్రభాస్ ఫ్యాన్‌బేస్ సపోర్ట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టెడీ రన్ కొనసాగిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X