The Rajasaab Day 8 Collections: ది రాజాసాబ్ తొలి వారం కలెక్షన్స్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Rajasaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ మూవీ ది రాజాసాబ్. విడుదలకు ముందుగానే ఈ సినిమాపై ఊహించని విధంగా భారీ హైప్ ఏర్పడింది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ, ప్రభాస్ స్టార్డమ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ నేపథ్యంలో వర్డల్ వైల్డ్ గా ది రాజా సాబ్ మూవీ ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..
అయితే సంక్రాంతి సీజన్ మొదలవడంతో పోటీ ఒక్కసారిగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుండగా, రవితేజా నటించిన 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' మాస్ సెంటర్లలో ప్రభావం చూపిస్తోంది. ఇదే సమయంలో నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద ' నారీనారీ నడుమ మురారీ' కూడా విడుదల కావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ల మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుస విడుదలల వల్ల 'ది రాజా సాబ్'కు స్క్రీన్స్, షో టైమింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

భారీ తారాగణం, అగ్రశ్రేణి టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఆంధ్రా-నైజాం, హిందీ బెల్ట్, తమిళం, కర్ణాటక, కేరళతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కలిపి ఈ సినిమాకి రూ.250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం సినిమా పూర్తిస్థాయిలో సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
విడుదలైన తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, స్టార్ పవర్, ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్‌తో ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి ఊపును కొనసాగిస్తోంది. తాజాగా 8వ రోజు వరకు డే వైజ్ కలెక్షన్ అంచనాలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం.. మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియా నెట్‌గా రూ.108 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.129.84 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, ఓవర్సీస్ నుంచి రూ.33.67 కోట్లు రాబట్టడంతో తొలి వీకెండ్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.163.51 కోట్లకు చేరింది. మిక్స్‌డ్ రివ్యూల మధ్య ఈ స్థాయి ఓపెనింగ్ రావడం ప్రభాస్ స్టార్డమ్‌కు నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
వీక్‌డేస్‌లో కూడా సినిమా డీసెంట్ రన్ కొనసాగించింది. డే 4 (సోమవారం) వరల్డ్‌వైడ్ రూ.9.2 కోట్లు, డే 5 (మంగళవారం) రూ.6.69 కోట్లు, డే 6 (బుధవారం) రూ.7.46 కోట్లు వసూలు చేయగా, డే 7 (గురువారం) సుమారు రూ.7.88 కోట్లకు చేరింది. వీకెండ్ తర్వాత కూడా నిలకడ కనిపించడంతో సినిమా ఫైనల్ రన్‌పై ఆశలు పెరిగాయి.
ఇక ఎనిమిది రోజు (శుక్రవారం) అంచనా ప్రకారం.. వరల్డ్‌వైడ్‌గా మరో రూ.8.79 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 8 రోజుల మొత్తం కలిపి ఇండియా నెట్ రూ.136.7 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.156.76 కోట్లు, ఓవర్సీస్ రూ.37.98 కోట్లు చేరి, వరల్డ్‌వైడ్ గ్రాస్ సుమారు రూ.203.53 కోట్లకు చేరే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ లెక్కలతో 'ది రాజా సాబ్' 8 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా సాగుతోంది.
ఇదిలా ఉండగా, మూవీ యూనిట్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ మరో చర్చకు దారి తీసింది. అధికారిక ప్రకటన ప్రకారం.. 'ది రాజా సాబ్' ప్రపంచవ్యాప్తంగా మొదటి 7 రోజుల్లోనే రూ.238 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని వెల్లడిస్తూ 'KING SIZE BLOCKBUSTER'అంటూ ప్రకటించింది. ట్రేడ్ అంచనాలు-ఆఫిషియల్ పోస్టర్ మధ్య గణాంకాల్లో తేడాలు ఉన్నప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి.. మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ ప్రభాస్ స్టార్డమ్‌తో 'ది రాజా సాబ్' భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. వచ్చే వీకెండ్‌లో వసూళ్లు ఎలా ఉంటాయన్నదే ఈ సినిమా ఫైనల్ బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది.


Click it and Unblock the Notifications











