4.5 కోట్లు బొక్క.. తలబాదుకొంటున్న రాజాసాబ్ డిస్ట్రిబ్యూటర్ (వీడియో)!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన కనిపించింది. ఈ మూవీ తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ టాక్ పాజిటివ్ మారకపోగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మెటీరియల్‌గా మారింది. క్రిటిక్స్ మాత్రం పూర్తిగా పెదవి విరిచారు. ఈ సినిమా నెగిటివ్ ట్రెండ్‌లోను బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తల మధ్య సోషల్ మీడియాలో ఓ డిస్డ్రిబ్యూటర్ తన తలను బాదుకొంటూ కనిపించడం ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సినిమా బిజినెస్ వర్గాలను ఆందోళన కలిగిస్తుందా? అనే విషయం చర్చనీయాంశమైంది. డిస్ట్రిబ్యూటర్‌కు సన్నిహితుడు చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
ది రాజాసాబ్ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో బిజినెస్ క్రేజ్‌గా జరిగింది. ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో భారీగా ట్రేడ్ జరిగింది. ఈ సినిమా బిజినెస్‌గా రికార్డు లెవెల్‌లో ముగించారు. కొన్ని చోట్ల పీపుల్స్ మీడియా నేరుగా రిలీజ్ చేయగా, కొన్ని సెంటర్లలో బయ్యర్లు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలా నెల్లూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ కూడా భారీగా జరిగింది అని వెల్లడించారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నెల్లూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడం జరిగింది. ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 8వ తేదీన గ్రాండ్‌గా ఏపీలో ప్రదర్శించారు. ప్రీమియర్లు ముగిసిన తర్వాత పాజిటివ్, నెగిటివ్ టాక్ మధ్య ఈ సినిమా నలిగిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన ప్రచారంతో ఇంకా మైనస్ జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వర్గీయుడు బూతులు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ దారుణంగా మారింది.
ది రాజాసాబ్ సినిమా నెల్లూరు థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్లకు అమ్మారు. ఇంకా రెండు, మూడు రోజులు ఏముంటుందో తెలియడం లేదు. రేపు చూస్కోండి సార్ అంటూ ఆవేశంగా బూతు పురాణంతో సంచలనం రేపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతున్నది. ఈ సినిమాపై ఉన్న ప్రతికూలమైన ప్రచారం కారణంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











