The Rajasaab Day 1 Hindi Collection: షాకింగ్‌గా రాజా సాబ్ హిందీ కలెక్షన్స్... ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌కు తెలుగుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆయన సినిమాలకు హిట్ట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ది రాజ్‌సాబ్ మూవీపైనా బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. హార్రర్, కామెడీ జోనర్స్‌కు నార్త్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో పాటు సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించడంతో ఈ సినిమాపై హిందీలోనూ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? హిందీలో రాజాసాబ్ తొలిరోజు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

ది రాజాసాబ్ తారాగణం
రాజాసాబ్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.
ది రాజాసాబ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది రాజాసాబ్ హిందీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
హిందీలో ది రాజాసాబ్ థియేట్రికల్ రైట్స్‌ను అనిల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. నార్త్‌లో ప్రభాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా హక్కులు 35 కోట్ల రూపాయలు పలికాయి. హిందీలో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాను దాదాపు 1100 థియేటర్‌లలో విడుదల చేశారు.
ది రాజాసాబ్ హిందీ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్
ది రాజాసాబ్‌కు హిందీలో తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్‌లో అంతంత మాత్రంగానే టికెట్లు బుక్ అయ్యాయి. మొత్తం 8697 షోలకు గాను 52,841 టికెట్లు అమ్ముడై... 1.17 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్‌గా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో ది రాజాసాబ్ 15.31 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఇది బాహుబలి తర్వాత ప్రభాస్‌కు డిజాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాధేశ్యామ్ (23.22) అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ కంటే తక్కువ కావడం గమనార్హం.
ది రాజాసాబ్ హిందీ ఫస్ట్ డే కలెక్షన్స్
ఇక ది రాజాసాబ్ తొలిరోజున హిందీలో కలెక్షన్స్ పరిశీలిస్తే... సాయంత్రం 7 గంటల వరకు 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ది రాజాసాబ్‌కు హిందీలో తొలిరోజు 1705 సెంటర్స్‌లో 2,11,750 టికెట్స్ అమ్ముడై 4.88 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజున ది రాజాసాబ్‌కు హిందీలో 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్గాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
అయితే ప్రభాస్ గత చిత్రాలు కల్కి 2898 ఏడీ, సలార్‌లతో పోలిస్తే ది రాజాసాబ్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదని చెబుతున్నారు. వీకెండ్‌లో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ నుంచి ది రాజాసాబ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాజా సాబ్ ఎంత వరకు నిలబడతాడో చూడాలి. మొత్తంగా ది రాజాసాబ్ ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తొలి రోజున వరల్డ్ వైడ్‌గా 70 నుంచి 80 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











