The Raja Saab Hindi Box Office: ది రాజాసాబ్‌కు భారీ ఎదురుదెబ్బ... 4 రోజుల్లో ప్రభాస్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజాసాబ్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో పాటు ఉత్తరాదిలోనూ ఆయనకు ఫాలోయింగ్ ఏర్పడింది. హిట్ట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయి. తాజాగా ది రాజాసాబ్ సినిమాపై హిందీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? హిందీలో రాజాసాబ్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

The RajaSaab Hindi Day 4 Box Office Collections Prabhas starrer sees major drop on 1st Monday in North India

ది రాజాసాబ్‌ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్‌ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది రాజాసాబ్‌ హిందీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
హిందీలో ది రాజాసాబ్ థియేట్రికల్ రైట్స్‌ 35 కోట్ల రూపాయలు పలికాయి. నార్త్ ఇండియాలో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలలో ది రాజాసాబ్ సినిమాను దాదాపు 1100 థియేటర్‌లలో విడుదల చేశారు.

ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌లో 9.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 53.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 26 కోట్ల రూపాయలు, మూడో రోజున 19.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 6.6 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 114 కోట్ల రూపాయల నెట్... 137 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ది రాజాసాబ్ సినిమాకు ఇప్పటి వరకు 33.5 కోట్ల రూపాయలు వసూలైంది. దాంతో నాలుగు రోజుల్లో ది రాజాసాబ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 170.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ది రాజాసాబ్ హిందీ కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజాసాబ్ చిత్రం అనుకున్న స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్, రివ్యూల కారణంగా ది రాజాసాబ్ కలెక్షన్స్ పడిపోతున్నాయి. దీనికి తోడు సంక్రాంతి సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ప్రభాస్ మూవీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హిందీలో ది రాజాసాబ్‌కు తొలిరోజున 6 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.75 కోట్ల రూపాయలు వసూలైంది. తద్వారా నాలుగు రోజుల వరకు ది రాజాసాబ్‌కు హిందీలో 17.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ప్రభాస్ మూవీకి నాలుగో రోజే వసూళ్లు దారుణంగా పడిపోతుండగా.. రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ మూవీ దురంధర్ మాత్రం 39వ రోజు కూడా హిందీ బెల్ట్‌లో తన హవా చూపిస్తోంది. సోమవారం రణ్‌వీర్ మూవీకి ఏకంగా 2.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చి స్పష్టమైన డామినేషన్ చూపిస్తోంది. హిందీలో ది రాజాసాబ్ బ్రేక్ఈవెన్ కావాలంటే మరో 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. దురంధర్‌కి తోడు మన శంకర వరప్రసాద్ నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ప్రభాస్ ఈ పోటీలో ఎంత వరకు నెట్టుకొస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X