The Raja Saab Hindi Box Office: నష్టాల్లో ది రాజాసాబ్‌.. ఫస్ట్ వీక్‌లో ప్రభాస్ మూవీకి హిందీలో ఎన్ని కోట్లంటే?

మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? హిందీలో రాజాసాబ్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

ది రాజాసాబ్‌ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్‌ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

The RajaSaab Hindi Day 7 Box Office Collections Prabhas film heading towards disaster in North India

ది రాజాసాబ్‌ హిందీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ప్రభాస్ క్రేజ్‌కు తోడు సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడంతో ది రాజాసాబ్‌పై హిందీలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఇక్కడ ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఉత్తర భారతదేశంలో ది రాజాసాబ్ సినిమాను దాదాపు 1100 థియేటర్‌లలో విడుదల చేశారు.

ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌లో 9.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 53.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 26 కోట్ల రూపాయలు, మూడో రోజున 19.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 6.6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 5.35 కోట్ల రూపాయలు, ఏడో రోజున 5.63 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 130.38 కోట్ల రూపాయల నెట్... 155.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. అటు ఓవర్సీస్‌లో ది రాజాసాబ్‌కు ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ది రాజాసాబ్‌కు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 188.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే ది రాజాసాబ్ చిత్రం జనవరి 13వ తేదీ నాటికే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయలు క్రాస్ చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.

ది రాజాసాబ్ హిందీ కలెక్షన్స్
ది రాజాసాబ్ హిందీలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతోంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు ప్రభాస్ మూవీ తడబడుతూనే ఉంది. తొలిరోజున హిందీలో 6 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి వారం ది రాజాసాబ్ మూవీ.. హిందీలో 25.69 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది.

మిక్స్‌డ్ టాక్‌ రావడంతో పాటు దురంధర్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి తదితర చిత్రాల నుంచి గట్టి పోటీ ఇవ్వడంతో ది రాజా సాబ్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రత్యేకించి రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ హవా ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో కనిపిస్తోంది. ది రాజాసాబ్ 7వ రోజు హిందీలో సాధించిన వసూళ్ల కంటే దురంధర్ రెట్టింపు రాబట్టింది. రణ్‌వీర్ మూవీకి సంక్రాంతి రోజున ఇండియాలో 3 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. ప్రభాస్ మూవీ హిందీలో లాభాల్లోకి రావాలంటే మరో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే హిందీలో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X