The RajaSaab Hindi Box Office: దారుణంగా ది రాజాసాబ్ కలెక్షన్స్... హిందీలో ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ది రాజాసాబ్ చిత్రం... ప్రభాస్ అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన మీడియం రేంజ్ సినిమాలతోనూ రాజాసాబ్ పోటీపడలేకపోతున్నాడు. ముఖ్యంగా హిందీలో ప్రభాస్ సినిమాకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. నార్త్ ఆడియన్స్ నుంచి కూడా ది రాజాసాబ్‌కు మద్ధతు లభించడం లేదు. చివరికి 40 రోజులకు పైగా పూర్తి చేసుకున్న దురంధర్‌ ముందు రాజాసాబ్ నిలబడలేకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? హిందీలో రాజాసాబ్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

ది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ సినిమా‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

The RajaSaab Hindi Day 9 Box Office Collections Prabhas film witnessed a big drop on its second Saturday

ది రాజాసాబ్‌ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్‌ మూవీకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. దాంతో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది రాజాసాబ్‌ హిందీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ది రాజాసాబ్ హిందీ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఇక్కడ ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ప్రభాస్ క్రేజ్, సినిమాపై అంచనాల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో ది రాజాసాబ్ సినిమాను దాదాపు 1100 థియేటర్‌లలో విడుదల చేశారు.

ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌లో 9.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 53.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 26 కోట్ల రూపాయలు, మూడో రోజున 19.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 6.6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 5.35 కోట్ల రూపాయలు, ఏడో రోజున 5.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 3.5 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 2.86 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 136.62 కోట్ల రూపాయల నెట్... 159.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. అటు ఓవర్సీస్‌లో ది రాజాసాబ్‌కు ఇప్పటి వరకు 33.25 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ది రాజాసాబ్‌కు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 193 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే ది రాజాసాబ్ చిత్రం జనవరి 13వ తేదీ నాటికే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయలు క్రాస్ చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.

ది రాజాసాబ్ హిందీ కలెక్షన్స్
తొలిరోజున హిందీలో 6 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 4.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 33 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 43 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి వారం ది రాజాసాబ్ మూవీ.. హిందీలో ఇప్పటి వరకు 27.49 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో ది రాజాసాబ్ కలెక్షన్స్ పరిశీలిస్తే....14.33 కోట్ల రూపాయలు, తెలుగులో 114.65 కోట్ల రూపాయలు, తమిళంలో 2.88 కోట్ల రూపాయలు, కేరళలో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది.

మిక్స్‌డ్ టాక్‌ రావడంతో ఇప్పటి వరకు ప్రభాస్ క్రేజ్‌తో ఈ సినిమా థియేటర్‌లలో నడుస్తోంది. మిక్స్‌డ్ టాక్‌తో పాటు సంక్రాంతి సినిమాల నుంచి గట్టి పోటీ రావడంతో ది రాజాసాబ్ నిలబడలేకపోతోంది. హిందీలో దురంధర్ చిత్రం 45 రోజులు కావొస్తోన్నా రోజుకు 3 కోట్ల రూపాయలు తగ్గకుండా రాబడుతుండగా.. ప్రభాస్‌ మూవీ 9వ రోజు ఆ మార్కెట్‌లో కేవలం 43 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టడం పరిస్థితిని తెలియజేస్తోంది. హిందీలో ది రాజాసాబ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 47 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఆదివారంతో సంక్రాంతి సెలవులు ముగుస్తుండటం, వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో ది రాజాసాబ్ ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X