The RajaSaab Karnataka Collection:కాంతారా రికార్డు రాజాసాబ్ బ్రేక్..నెగిటివ్ ట్రెండ్‌లో ప్రభాస్ మూవీ రికార్డ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్కి 2898 ఏడీ విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో ది రాజా సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు రోజు రాత్రి (జనవరి 8న) భారత్‌తో పాటు పలు దేశాల్లో రాజా సాబ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ప్రీమియర్స్ ద్వారా కర్ణాటకలో ఈ సినిమా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే...

ది రాజాసాబ్‌ తారాగణం
రాజాసాబ్‌లో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

The RajaSaab Karnataka Collections Prabhas movie beats Kantara Chapter 1 Premieres Gross Day 1 Advance Sales

ది రాజాసాబ్‌ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజా సాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్‌ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కర్ణాటకలో హోంబలే చేతికి ది రాజాసాబ్‌
కర్ణాటకలో ది రాజా సాబ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది. కేజీఎఫ్ సిరీస్, కాంతార సిరీస్‌తో పాటు మహావతార్ నర్సింహా వంటి సినిమాలతో హోంబలే ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సంస్థ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 1ని తెరకెక్కించింది. తాజాగా ది రాజా సాబ్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను హోంబలే ఫిల్మ్స్ 15 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ప్రభాస్ మూవీ కన్నడ నాట బ్రేక్ ఈవెన్ కావాలంటే 35 కోట్ల రూపాయల గ్రాస్..17 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది.

కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్‌లో ఎంతంటే?
కర్ణాటకలో ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజధాని బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఆంధ్రా- తెలంగాణలతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాలలో ది రాజా సాబ్‌కు మంచి బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్‌లో 2006 షోలకు గాను 2.23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బ్లాక్ చేసిన సీట్లతో కలిపితే ఈ మొత్తం 4.22 కోట్ల రూపాయలు ఉంటుందని సాక్‌నిక్ నివేదించింది.

కాంతార రికార్డ్ బ్రేక్
జనవరి 8వ తేదీ రాత్రి కర్ణాటకలోనూ ది రాజా సాబ్ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ + డే 1 అడ్వాన్స్ సేల్స్‌లో ఈ సినిమాకు కర్ణాటక నుంచి 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. తద్వారా కర్ణాటకలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌‌లో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కాంతార: చాప్టర్ 1 (3.73 కోట్ల రూపాయలు) రికార్డును బద్ధలు కొట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ - సుజీత్‌ల ఓజీ 2.72 కోట్ల రూపాయలు రెండో స్థానంలో ఉండగా... అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 2.55 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచాయి. ఇప్పుడు తాజాగా రాజాసాబ్ దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. రాజాసాబ్‌కు మిక్స్‌డ్ రివ్యూలు, నెగిటివిటీ మధ్య ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి వీకెండ్ నాటికి ది రాజా సాబ్ కర్ణాటకలో ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X