The Rajasaab Business: ది రాజాసాబ్ బిజినెస్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.

ది రాజా సాబ్ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాపై పబ్లిక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సొంతంగా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. సీడెడ్ ఏరియాలో శోభన్ డిస్ట్రిబ్యూషన్, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉషా పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నది.
రాజా సాబ్ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా రికార్డు లెవెల్ స్పందన లభిస్తున్నది. నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 9 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 80 కోట్ల రూపాయలు చెల్లించి ప్రత్యాంగీరా సినిమాస్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 18 మిలియన్ డాలర్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ది రాజా సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోను, ఇతర రాష్ట్రాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హకకులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ సుమారుగా 220 నుంచి 230 కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని తెలిసింది.
ది రాజా సాబ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉంటే.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. శాటిలైట్ రేట్స్ 140 కోట్ల మేర, అలాగే డిజిటల్ రైట్స్ 190 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఈ బిజినెస్ వల్ల బడ్జెట్‌లో దాదాపు 50 శాతానికిపైగా రికవరీ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











