The Rajasaab USA Box Office: అమెరికాలో ది రాజాసాబ్ కలెక్షన్స్... 2 రోజుల్లో ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది రాజాసాబా. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్‌లు హీరోయిన్‌లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజాసాబ్ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నార్త్ అమెరికాలో రాజా సాబ్ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...
ది రాజాసాబ్ తారాగణం
రాజాసాబ్‌లో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషించారు. బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ది రాజా సాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. థమన్ సంగీత దర్శకత్వం వహించారు.

ది రాజాసాబ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజా సాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ది రాజాసాబ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కుపైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది రాజాసాబ్ ఓవర్సీస్ బిజినెస్
ఓవర్సీస్‌లో ది రాజా సాబ్ సినిమాను ప్రత్యంగిరా మూవీస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 10 మిలియన్ డాలర్లు (90 కోట్ల రూపాయలు)... నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 మిలియన్ డాలర్లు (68 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు.
ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో 9.15 కోట్ల రూపాయలు, తొలిరోజున 53.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 27.83 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో రెండ్రోజుల్లో 90.73 కోట్ల రూపాయల నెట్... 108.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 78.68 కోట్ల రూపాయలు, హిందీలో 11.2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 55 లక్షల రూపాయలు, కర్ణాటకలో 16 లక్షల రూపాయలు, మలయాళంలో 14 లక్షల రూపాయలు వసూలు చేసింది.
ది రాజాసాబ్ నార్త్ అమెరికా కలెక్షన్స్
ది రాజాసాబ్ మూవీకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + డే 1 గ్రాస్ కింద 1.765 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయలు) వసూలైంది. అమెరికాలో 1.635 మిలియన్ డాలర్లు (14.80 కోట్ల రూపాయలు), కెనడాలో 130K డాలర్లు (1.17 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇందులో ఒక్క ప్రీమియర్స్ ద్వారానే 1.4 మిలియన్ డాలర్లు (12.63 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. తద్వారా నార్త్ అమెరికాలో టాప్ 10 తెలుగు బెస్ట్ ఓపెనింగ్ మూవీగా ది రాజా సాబ్ నిలిచింది. అలాగే ప్రభాస్ కెరీర్‌లో నార్త్ అమెరికాలో 4వ అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
ది రాజాసాబ్ ఓవర్సీస్ కలెక్షన్స్
ది రాజాసాబ్ మూవీకి రెండో రోజున నార్త్ అమెరికాలో వచ్చిన కలెక్షన్స్ పరిశీలిస్తే... శనివారం మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం ప్రభాస్ మూవీకి 185k డాలర్లు (1.66 కోట్ల రూపాయలు) వచ్చింది. అయితే రెండో రోజు ప్రభాస్ మూవీ నార్త్ అమెరికాలో 2 లక్షల డాలర్లకు పైగా రాబట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల వరకు ది రాజాసాబ్ మూవీకి నార్త్ అమెరికాలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ది రాజా సాబ్‌కు మరో 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చింది. దాంతో ఓవర్సీస్ నుంచి ది రాజాసాబ్ మూవీరెండ్రోజుల వరకు 30 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ప్రభాస్ మూవీ వరల్డ్ వైడ్‌గా 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.


Click it and Unblock the Notifications











