12 రోజుల్లో 6000 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న యానిమేషన్ చిత్రం

హాలీవుడ్‌‌లో తెరకెక్కిన అడ్వెంచరస్ కామెడీ యానిమేషన్ ఫిల్మ్ ది సూపర్ మారియో గెలాక్సీ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్నది. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ముఖ్యంగా ఓవర్సీస్‌తోపాటు నార్త్ అమెరికాలో 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

ఈ సినిమా విషయానికి వస్తే.. ఆరోన్ హోర్వాత్, మైఖేల్ జెలెనిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతంలో అంటే 2023 సంవత్సరంలో వచ్చిన ది సూపర్ మారియో బ్రాస్ మూవీకి సీక్వెల్. ఈ యానిమేషన్ సినిమాను ఇల్యూమినేషన్, నింటేండో బ్యానర్లపై క్రిస్ మెలెడాండ్రీ, షింగేరు మియామోటో నిర్మించారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, అన్యా టేలర్, చార్లీ డే, జాక్ బ్లాక్, కీగన్ మైఖేల్ కీ, బెన్నీ సాఫ్ డై, డొనాల్డ్ గ్లోవర్, గ్లెన్ పావెల్ తదితరులు తమ గొంతుతో యానిమేషన్ క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పారు. బ్రియాన్ టైలర్ సంగీతం అందించారు. యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 1వ తేదీన అమెరికాలో రిలీజ్ అయింది.

The Super Mario Galaxy Box Office Collections

యానిమేషన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా నిడివి కేవలం 98 నిమిషాలు మాత్రమే. అయితే ఈ సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. ఆడియెన్స్‌ను కట్టిపడేసే విధంగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ డిజైన్ చేయడంతో ఈ మూవీ బడ్జెట్ సుమారుగా 110 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1026 కోట్ల బడ్జెట్‌ అయింది. యానిమేషన్ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియాలో ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ నంబర్లు చాలా పేలవంగా నమోదు అయ్యాయి. తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 1.50 కోట్లు, మూడో రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక గత 10 రోజుల్లో ఈ చిత్రం కేవలం 5.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం నార్త్ అమెరికా, విదేశాల్లో కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ చిత్రం గత 12 రోజుల్లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 329 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3070 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికేతర దేశాల్లో ఈ చిత్రం 300 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 2800 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5870 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ది సూపర్ మారియో గెలాక్సీ చిత్రం నార్త్ అమెరికా, ఇంకా యూకే, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాల్లో కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా 2026 సంవత్సరంలో విడుదలైన అన్ని చిత్రాల్లో కంటే అధికంగా వసూళ్లను సాధించింది. రెండో వారం ముగిసే సమయానికి 700 మిలియన్ డాలర్ల కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: hollywood box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X