The Vaccine War Closing Collections ది వాక్సిన్ వార్ డిజాస్టర్.. 40 కోట్ల బిజినెస్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది వాక్సిన్ వార్ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే భారీ విజయం సాధించడం ఖాయంగా ట్రేడ్ వర్గాల్లో ఆశలు రేపింది. సినిమా అభిమానుల్లో కూడా కొత్త కంటెంట్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించింది. ఇలాంటి అంచనాలతో ది వ్యాక్సిన్ వార్ చిత్రం అక్టోబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైందా? అనే విషయంలోకి వెళితే..
ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో ప్రముఖ నటులు నానా పాటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమీ గౌడ లాంటి యాక్టర్లు నటించారు. అలాగే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ది కశ్మీర్ ఫైల్ సినిమా ప్రభావంతో భారీ బజ్‌ను క్రియేట్ చేసుకొని ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ది వ్యాక్సిన్ వార్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిసి ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు ఈ సినిమా బిజినెస్ 35 కోట్ల రూపాయలుగా జరిగినట్టు ప్రచారమైంది. దాంతో ఈ సినిమా టార్గెట్ సుమారుగా 40 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమాను ఇండియాలోనే 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది వ్యాక్సిన్ వార్ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. ది కశ్మీర్ ఫైట్స్ సినిమా తొలి రోజు 3 కోట్లకుపైగా కలెక్షన్లను సాధిస్తే.. ఈ సినిమా ఇండియాలో 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండో రోజు 65 లక్షలు రాబట్టింది. మూడో రోజు సెలవు దినం కావడంతో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. నాలుగో రోజు 1.55 కోట్లు, ఐదో రోజు 1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజు 50 లక్షలు మాత్రమే రాబట్టింది.

ది వ్యాక్సిన్ వార్ ఆక్యుపెన్సీ పేలవంగా ఉండటంతో 1000కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ సినిమాను తొలి వారాంతం తర్వాత థియేటర్ల నుంచి తొలగిస్తూ వచ్చారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆశించినంత ఫలితం ఇవ్వలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

ఇక ది వ్యాక్సిన్ వార్ చిత్రం 40 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ సినిమా 6 కోట్ల రూపాయలు మాత్రమే బాక్సాఫీస్ నుంచి కలెక్ట్ చేసింది. మౌత్ టాక్ పెరిగే అవకాశాలు కూడా లేకపోవడంతో తొలివారంలోనే ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. దాంతో ఈ చిత్రం 30 కోట్లకుపైగా నష్టాన్ని థియేట్రికల్‌గా నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











