The Vaccine War Collections షాకింగ్‌గా ది వ్యాక్సిన్ వార్ కలెక్షన్లు.. ది కశ్మీర్ ఫైల్స్ రేంజ్‌లో.. ఎన్ని కోట
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం వాక్సీన్ వార్. కరోనా వైరస్ సమయంలో వాక్సిన్ రూపొందించన సమయంలో జరిగిన సంఘటనలు, వివాదాలు, అవకతకవలపై దర్శకుడు విమర్శనాస్త్రం సంధించారు. అలాంటి సెన్సేషనల్ సంఘటనలతో రూపొందించిన సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ది వ్యాక్సిన్ వార్ మూవీలో :ది వ్యాక్సిన్ వార్ సినిమా విషయానికి వస్తే.. పల్లవి జోషి, నానా పాటేకర్, అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమీ గౌడ తదితరులు నటించారు. ఈ సినిమా ద్వారా కాంతారా హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. ది కశ్మీర్ ఫైల్స్ క్రేజ్ మరింత బజ్ క్రియేట్ చేసింది.

ది వ్యాక్సిన్ వార్ బడ్జెట్:ది వ్యాక్సిన్ వార్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సీనియర్, జూనియర్ నటులు కూర్పుతో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ దాదాపు 30 కోట్ల వరకు అయింది. దాంతో ఈ సినిమా భారీ బాక్సాఫీస్ టార్గెట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ది వ్యాక్సిన్ వార్ స్క్రిన్ కౌంట్:ది కశ్మీర్ ఫైల్స్ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను ఇండియాలో భారీగా రిలీజ్ చేశారు. హిందీ, దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా 1000 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్పాన్స్ లేకపోయినా.. మీడియం రేంజ్‌లో వచ్చింది.

ది వ్యాక్సిన్ వార్ కలెక్షన్లు:ది వ్యాక్సిన్ వార్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ది కశ్మీర్ ఫైల్స్ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఈ సినిమాకు తొలి రోజు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం కావడంతో ఈ సినిమా ఓపెన్సింగ్ తక్కువగానే వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ కారణంగా మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది వ్యాక్సిన్ వార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్:ది వ్యాక్సిన్ వార్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. ఈ సినిమా హిట్ సాధించాలంటే కనీసం 25 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. సూపర్ హిట్ అంటే 45 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ తొలి రోజు ఇండియాలో 85 లక్షల షేర్, 1.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూాపాయలు వసూలు చేసింది.
ది వ్యాక్సిన్ వార్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 60 లక్షల షేర్ సాధించే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ 1.25 కోట్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











