The Warriorr day 2 collections: నిలకడగా రామ్ మూవీ కలెక్షన్లు.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను రాబడుతున్నది. తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్న ఈ చిత్రం రెండో రోజు ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులను తట్టుకొని ది వారియర్ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది. రెండో రోజు ది వారియర్ మూవీ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్
రామ్ పోతినేని తొలిసారి పోలీస్ పాత్రలో నటించిన ది వారియర్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం 10 కోట్లు (స్రవంతి మూవీస్ సొంతంగా రిలీజ్), సీడెడ్ 5 కోట్లు, ఆంధ్రా 15 కోట్లతో 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 2.10 కోట్లు, తమిళ వెర్షన్ 4 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం 39 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

రెండో రోజు కలెక్షన్లు
వారియర్ చిత్రం రెండో రోజు నైజాంలో 90 లక్షలు, సీడెడ్‌లో 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 32 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 21 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో 19 లక్షలు, కృష్ణా జిల్లాలో 12 లక్షలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 2.30 కోట్ల షేర్, 3.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మొత్తం రెండు రోజుల కలెక్షన్లు
వారియర్ చిత్రం గత రెండు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.2.85 కోట్లు, సీడెడ్‌లో 1.46 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.34 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 72 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 76 లక్షలు, గుంటూరులో 1.38 కోట్లు, కృష్ణా జిల్లాలో 45 లక్షలు, నెల్లూరులో 36 లక్షల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 9.32 కోట్ల షేర్, 13.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక, తమిళ రాష్ట్రాల్లో
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 39 లక్షలు, తమిళ భాషలో 44 లక్షలు షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10.65 కోట్ల షేర్, 16.55 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రేంజ్ వసూళ్లను సాధించడం రామ్ బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ది వారియర్ లాభాల్లోకి రావాలంటే..
ప్రపంచవ్యాప్తంగా ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 38 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ చిత్రం 39 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 10.85 కోట్ల షేర్ సాధించిన నేపథ్యంలో.. ఇంకా ఈ చిత్రం 28 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సింది. ఈ చిత్రం హిట్‌ను నమోదు చేస్తుందా అనే విషయం రానున్న రెండు మూడు రోజుల్లో తెలిపోతుంది.


Click it and Unblock the Notifications











