అల్లు అర్జున్..ఆర్య-2 కు మరో దెబ్బ
అసలే నెగిటివ్ టాక్ తో సతమతమవుతున్న ఆర్య-2 చిత్రానికి తెలంగాణ రెండు రోజుల బంద్ తో మరో ఎదురు దెబ్బ తగిలింది. శని,ఆదివారాల్లో వీకెండ్ ని ఎంజాయ్ చేయటానికి ధియోటర్స్ కు వెళ్ళే వారి నుంచి వచ్చే కలెక్షన్స్ పై సినిమావారికి మంచి ఆశలు ఉంటాయి.ఇవి దాదాపు వారంలో ఫిప్టీ పర్సంట్ దాకా ఉంటాయి. అయితే కేసీఆర్‌కు దీక్షకు మద్దతుగా 48 గంటల పాటు తెలంగాణ ప్రాంతంలో తెరాస బంద్‌కు పిలుపునిచ్చింది. నిన్న సాయింత్రం(శనివారం)నుంచే పి.వి.ఆర్,బిగ్ సినిమా వంటివి క్లోజ్ చేసేసారు. అందులో నగరంలో అలజడి ఉండటంతో ఎవరూ బయిటకు వచ్చేటట్లు కనపడటం లేదు. ఇక ఇప్పటికే నైజాం ఏరియాల్లో గత వారంలో రోజులుగా కేసీఆర్ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ బాగా డ్రాపయ్యాయి. అలాగే ఈ వారం రిలీజైన సారాయి వీర్రాజు,ప్రవరాఖ్యుడు, అమరావతి చిత్రాల కలెక్షన్స్ కు సైతం ఈ బంద్ దెబ్బ తగిలింది. అయితే పెద్ద సినిమా ఆర్య-2 కావటంతో దానికే ఎక్కువ ఎఫెక్టు ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.


Click it and Unblock the Notifications











