Thimmarajupalli TV Day 1 Box Office: తిమ్మరాజుపల్లి టీవీ తొలిరోజు కలెక్షన్లు ఎంత? కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేనా?

Thimmarajupalli TV Box Office Collection: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో కొత్త అడుగు 'తిమ్మరాజుపల్లి టీవీ'. హీరోగా వరుస విజయాలతో దూసుకెళ్తునే, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని భావించిన యంగ్ హీరో తన కలను ఈ సినిమాతో సాకారం చేసుకున్నారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 90వ దశకపు గ్రామీణ నేపథ్యంతో కథతో రూపొందించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌లతో మంచి బజ్ క్రియేట్ చేయడంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, శుక్రవారం (ఏప్రిల్ 17న) విడుదలైన ఈ సినిమా తొలిరోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తిమ్మరాజుపల్లి టీవీ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే

Thimmarajupalli TV Day 1 Expected Box Office Collections Worldwide Kiran Abbavaram Film Opening Box Office Report

కిరణ్ అబ్బవరం నిర్మాతగా, వి.మునిరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాతో దాదాపు 50 మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. సాయితేజ్, వేధా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించారు. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే 90వ దశకపు పీరియాడికల్ డ్రామాగా రూపొందించారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ కాంత రేఖ సంగీతం అందించగా, అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నైజాం ఏరియా రైట్స్ కోసం పోటీ నెలకొనడం విశేషం. చివరికి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ (Dil Raju)ఈ హక్కులను దాదాపు రూ.1 కోటి చెల్లించి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై హైప్స్ క్రియేట్ అయ్యింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి ఈ సినిమాకు సుమారు రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే సినిమా రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3.5 కోట్ల షేర్ అందుకోవాలి . అంటే.. సుమారు రూ.6 కోట్ల గ్రాస్ అవసరం అని ట్రేడ్ అంచనాలు వేస్తున్నాయి.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన తిమ్మరాజు టీవీ సినిమా విడుదలైన తరువాత మిక్స్‌డ్ టాక్ రావడం గమనార్హం. ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్, కథ ముందుకు వెళ్లడంలో ఆలస్యం వంటి అంశాలు నెగటివ్‌గా వినిపించాయి. అయితే సెకండ్ హాఫ్‌లో మిస్టరీ ఎలిమెంట్, క్లైమాక్స్ ట్విస్ట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టేలా చేశాయి.

ముఖ్యంగా గ్రామీణ నేటివిటీ, చిత్తూరు యాస, సహజమైన నటన సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయని చెబుతున్నారు. ఈ అంశాల వల్లే మొదటి రోజు కలెక్షన్లు పూర్తిగా డ్రాప్ కాకుండా స్టేబుల్‌గా నిలిచాయి. ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం తీసుకున్న నిర్ణయం ట్రేడ్ పరంగా చాలా సేఫ్ అని చెప్పాలి. భారీ బడ్జెట్ పెట్టకుండా, కంటెంట్ ఆధారంగా సినిమా నిర్మించడం, కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఇవి రెండూ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను రిస్క్ లేకుండా చేసినట్టు తెలుస్తోంది.

ఇలా మిక్స్డ్ టాక్ అందుకున్న తిమ్మరాజు టీవీ సినిమా మొదటి రోజే డీసెంట్ ఓపెనింగ్ అందుకోబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ 1.45 కోట్ల నెట్, రూ. 1.74 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముందట. ఇక ఇండియా వైడ్ గా చూస్తే.. సుమారు రూ.2 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముందట. ఇక వరల్డ్‌వైడ్‌గా చూస్తే రూ.2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న బడ్జెట్, కొత్త నటీనటులతో వచ్చిన సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ రావడం విశేషమే అని చెప్పాలి. ముఖ్యంగా కంటెంట్ ఆధారంగా వచ్చిన సినిమాలకు ఓపెనింగ్ కంటే మౌత్ టాక్ ముఖ్యమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, సాటిలైట్) ద్వారా కూడా రికవరీ అయ్యే అవకాశాలు ఉండటంతో, థియేట్రికల్ కలెక్షన్లు అదనపు లాభాలుగా మారే ఛాన్స్ ఉంది.మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ అందుకున్న ఈ సినిమా భవిష్యత్ పూర్తిగా మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరిగితే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను త్వరగా చేరుకునే అవకాశం ఉంది. గ్రామీణ కథలు, నాస్టాల్జియా అంశాలు ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తే ఈ సినిమా స్లోగా పికప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X