Thimmarajupalli TV Business: తిమ్మరాజుపల్లి టీవీకి ఊహించని బిజినెస్.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే?

హీరోగా వరుస విజయాలు సాధిస్తూనే, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మినిమమ్ గ్యారంటీ హీరోగా, చిన్న నిర్మాతలకు ఫేవరెట్‌గా నిలుస్తున్నారు కిరణ్. హీరోగా బిజీగా ఉన్నప్పటికీ.. యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేఏ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా కిరణ్ అబ్బవరం బ్యానర్ నుంచి వస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. 90వ దశకం నాటి పీరియాడికల్ డ్రామాగా, గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తిమ్మరాజుపల్లి టీవీ తారాగణం
కేఏ ప్రొడక్షన్స్, సుమైరా స్టూడియోస్ బ్యానర్‌లపై కిరణ్ అబ్బవరం, తేజా వేల్పుచర్ల సంయుక్తంగా తిమ్మరాజుపల్లి టీవీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయితేజ్, వేధా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా.. వి మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీకాంత్ రేఖానా సంగీతం అందిస్తుండగా.. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Thimmarajupalli TV Movie Pre Release Business Worldwide Kiran Abbavaram Movie Budget Theatrical Business Break Even Target details

తిమ్మరాజుపల్లి టీవీ వెరైటీగా ప్రమోషన్స్
ప్రస్తుతం సినిమా ప్రారంభోత్సవం నుంచి థియేటర్‌లోకి వచ్చే వరకు రకరకాల ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తిమ్మరాజుపల్లి టీవీ పబ్లిసిటీని కిరణ్ అబ్బవరం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వెరైటీగా నిర్వహించారు. సినిమాలో నటించిన వారిని 1990ల నాటి నటీనటుల గెటప్‌లలో వచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా నట సింహం నందమూరి బాలకృష్ట నటించిన చెన్నకేశవరెడ్డి గెటప్‌లో వచ్చారు. అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా నాటి నటీమణుల్లా మిగిలిన వారు స్టేజ్‌పై సందడి చేశారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.

తిమ్మరాజుపల్లి టీవీపై అంచనాలు
టీజర్, ట్రైలర్లు ప్రమోషనల్ కార్యక్రమాలతో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాపై బజ్ నెలకొంది. రిలీజ్ వరకు ఇదే ఉత్కంఠను ప్రజల్లో కలిగించాలని కిరణ్ అబ్బవరం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తిమ్మరాజుపల్లి టీవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో నైజాం ఏరియా హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, ఆసియన్ సునీల్ వంటి వారు పోటీ పడటం విశేషం.

దిల్‌రాజు చేతికి నైజాం రైట్స్
చివరికి ఈ మూవీ నైజాం రైట్స్‌ను దిల్‌రాజు దాదాపు కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకున్నారు. దిల్‌రాజు లాంటి వ్యక్తి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయడంతో తిమ్మరాజుపల్లి టీవీ అంచనాలను మరింత పెంచిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాలో విషయం లేకపోతే దిల్‌రాజు అలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు. నైజాంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు ఉన్న బలం నేపథ్యంలో.. సినిమాకు మంచి టాక్ వస్తే కనుక దిల్‌రాజుకు భారీ లాభాలు వస్తాయని చెబుతున్నారు.

తిమ్మరాజుపల్లి టీవీ బిజినెస్
మరోవైపు.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తిమ్మరాజుపల్లి టీవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిమ్మరాజుపల్లి టీవీ మూవీ లాభాల్లోకి రావాలంటే 3.5 కోట్ల రూపాయల షేర్.. 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X