Thimmarusu, ishq 3 days collections: డేంజర్ జోన్.. కలెక్షన్స్ ఇలా ఉంటే ఇప్పట్లో ఏ సినిమా రాదేమో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల అనంతరం బాక్సాఫీస్ ఓపెన్ అయ్యింది. రెండు చిన్న రీమేక్ సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా చాలా తక్కువ ఏరియాల్లోనే విడుదల అయ్యాయి. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయా అని ఎదురుచూసిన సినీ నిర్మాతలకు కాస్త చేదు అనుభవం ఎదురైంది. మొదటి రెండు రోజుల కంటే ఆదివారం కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ సోమవారం నుంచి ఆ రేంజ్ లో వస్తాయా రావా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇష్క్, తిమ్మరుసు కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

ఆ ధైర్యం థియేటర్స్ వరకు రప్పిస్తుందా?

ఆ ధైర్యం థియేటర్స్ వరకు రప్పిస్తుందా?

కరోనా భయం అయితే తగ్గినట్లు బయట జనాలను చూస్తేనే అర్ధమవుతోంది. కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం మరువలేదు. ఇక ఆ ధైర్యం థియేటర్స్ వరకు రప్పిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఓ వర్గం జనాలు రావచ్చు గాని ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం అంతగా రాకపోవచ్చని ఇటీవల విడుదలైన సినిమాలతో అర్ధమయ్యింది.

ఓటీటీలో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ..

ఓటీటీలో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ..

గత శుక్రవారం వరుసగా 5 సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అందులో ఎక్కువ మందికి తెలిసిన సినిమాలు మాత్రం రెండే. తేజ సజ్జ ఇష్క్ సినిమాతో పాటు సత్యదేవ్ తిమ్మరుసు విడుదలకు ముందు కాస్త బజ్ అయితే క్రియేట్ చేశాయి. ఓటీటీలో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ సినిమాల నిర్మాతలు చాలా ధైర్యంగా థియేట్రికల్ బిజినెస్ వైవు ఇంట్రెస్ట్ చూపారు.

ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది

ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది

ఇక సినిమాల కలెక్షన్స్ విషయానికి వస్తే ఇష్క్ - తిమ్మరుసు రెండు కూడా కాస్త రిస్క్ చేశాయనే చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు కరోనా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ భారీగా తగ్గడంతో తీవ్రంగా ప్రభావం చూపించింది. పైగా సినిమా థియేటర్స్ ముందు ఓ వర్గం యువత తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్దగా కనిపించడం లేదు.

ఇష్క్ 3 రోజుల కలెక్షన్స్

ఇష్క్ 3 రోజుల కలెక్షన్స్

తేజ సజ్జ జాంబీ రెడ్డి సినిమాతో మొన్న మంచి వసూళ్లని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే నమ్మకంతో ఇష్క్ సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.7కోట్లు. ఇక మూడు రోజుల్లో కేవలం 47లక్షలు షేర్ మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. హిట్టవ్వాలి అంటే ఈ సినిమా ఇంకా 2కోట్లకు పైగానే రాబట్టాలి.

తిమ్మరుసు 3రోజుల కలెక్షన్స్

తిమ్మరుసు 3రోజుల కలెక్షన్స్

ప్రయోగాత్మకమైన సినిమాలతో ప్రతిసారి మంచి బజ్ క్రియేట్ చేసేన సత్యదేవ్ ఈసారి ఈసారి తిమ్మరుసు అనే సినిమాతో వచ్చాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిమ్మరుసు 2.6కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ముడవరోజు 54లక్షల షేర్ రాగా మొత్తంగా మూడు రోజుల్లో 94లక్షల షేర్ దక్కింది. హిట్టవ్వాలి అంటే మరో కోటిన్నరకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంటుంది.

Recommended Video

SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
సోమవారం అసలు పరీక్ష

సోమవారం అసలు పరీక్ష

సోమవారం నుంచి ఈ రెండు సినిమాలకు అసలు పరీక్ష మొదలుకానుంది. తిమ్మరుసు కాస్త పాజిటివ్ టాక్ తో అయితే వెళుతోంది. ఇక ఇష్క్ అయితే అంతగా క్లిక్కవ్వలేదు. మొత్తంగా వీకెండ్ కలెక్షన్స్ వల్ల కోటి రూపాయల షేర్ కూడా రాలేదు అంటే సోమవారం కలెక్షన్స్ భారీగా తగ్గవచ్చని టాక్ వస్తోంది. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా తొందరగా సేఫ్ జోన్ లోకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X