Thiruchitrambalam day 2 collections బాక్సాఫీస్ వద్ద ధనుష్ హంగామా
విలక్షణ నటుడు ధనుష్ నటించిన తిరు (తమిళంలో తిరుచిత్రంబళం) సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. నిత్య మీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీ ఖన్నా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18వ తేదీన రిలీజైన ఈ చిత్రం సగటు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. అయితే ఈ సినిమా వసూళ్లు రెండో రోజు అంచనా ఎలా ఉందంటే?

మిత్రా జవహార్ దర్శకత్వంలో
తెలుగు సినిమాలను రీమేక్ చేసి ఫీల్‌గుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న మిత్రన్ జవహార్ తిరు చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించారు. తండ్రి కొడుకులుగా భారతీరాజా, ప్రకాశ్ రాజ్, అలాగే తండ్రి కొడుకులుగా ప్రకాశ్ రాజ్, ధనుష్ పాత్రలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం సినిమా మరో రేంజ్‌కు వెళ్లలేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ముగ్గురు హీరోయిన్లతో ధనుష్
ఇక తిరుచిత్రంబళం సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ధనుష్ లవ్ ట్రాక్ నడుస్తుంది. ఏ లవ్ ట్రాక్ కూడా హృదయాన్ని తాకేలా రూపొందకపోవడం ఈ సినిమాకు మైనస్ అనిపిస్తుంది. కొంతలో కొంత నిత్య మీనన్‌తో కెమిస్ట్రీ వర్కువుట్ అయిందనిపిస్తుంది.

తొలి రోజు కలెక్షన్లు ఎలా అంటే
ఇలాంటి టాక్ సంపాదించుకొన్న తిరు చిత్రం తొలి రోజున ఇండియా వ్యాప్తంగా 9.52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడులోనే ఈ చిత్రం 9 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు, కన్నడ భాషల్లో 50 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈచిత్రం 1.3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా
ఇక తిరుచిత్రాంబళం రెండో రోజు కూడా భారీగానే వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా వ్యాప్తంగా 8 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తే.. ఈ చిత్రం వారాంతానికి 30 నుంచి 40 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టచవచ్చు అని అంటున్నారు.

ధనుష్‌కు కలిసి వచ్చిన లాంగ్ వీకెండ్
తిరుచిత్రాంబళం సినిమాకు లాంగ్ వీకెండ్ బాగా కలిసి వచ్చిన అంశం. గురువారం రిలీజైన ఈ చిత్రం ఆదివారం వరకు సెలవులు కావడంతో కలెక్షన్లు పాజిటివ్‌గా కనిపించాయి. తమిళనాడులో కార్తీ నటించిన వీరుమన్ చిత్రం నుంచి ధనుష్ గట్టి పోటి ఎదుర్కొంటున్నాడు.


Click it and Unblock the Notifications











