ఈ శుక్రవారం రాబోయే సినిమాల బాక్సాఫీస్ టార్గెట్స్.. ఏ సినిమాకు ఎంత రావాలంటే?

ఈ వ్ఏడదే మొదట్లో బాక్సాఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలు మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాలు వాటి స్థాయికి తగ్గట్టుగా మంచి వసూళ్లను సాధించాయి. అయితే రీసెంట్ గా మాత్రం మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి. విరుపాక్ష సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ పడలేదు. ఇక మే 26వ తేదీన శుక్రవారం రోజు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే టార్గెట్ ను ఫినిష్ చేసుకుంటుంది అనే వివరాల్లోకి వెళితే..

'మెన్ టూ' బిజినెస్ ఎంత?: ముందుగా 'మెన్ టూ' అనే ఒక సినిమా సోషల్ మీడియాలో విభిన్నమైన ప్రమోషన్స్ తో బాగానే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ అలాగే మరి కొంతమంది ప్రముఖ నటీనటులు కీలకమైన పాత్రలో కనిపించారు. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా కామెడీగా ఈ సినిమాలో చూపించినట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా మొత్తంగా 1.40 కోట్లు రేంజ్ లో బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 1.60 కోట్ల రేంజ్ లో షేర్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను 230 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

 tollywood movies

మేమ్ ఫేమస్ బాక్సాఫీస్ టార్గెట్: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అలాగే టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మేమ్ ఫేమస్ అనే సినిమా కూడా ఈ శుక్రవారం రాబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫుల్ ఫన్ అండ్ డ్రామాగా తెరపైకి వస్తున్న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 250 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా రెండు కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా 2.20 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.

 tollywood movies

మళ్ళీ పెళ్లి.. బాక్సాఫీస్ టార్గెట్: ఇక ఈ శుక్రవారం ఎక్కువగా అయితే మళ్ళీ పెళ్లి అనే సినిమాపై జనాల ఫోకస్ ఎక్కువగా పడనున్నట్లు అర్థమవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నరేష్ పవిత్ర లోకేష్ వారి రియాలిటీ లైఫ్ కు దగ్గరగా ఉండేలా ఈ సినిమాలో నటించినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ అలాగే వారు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కూడా 220 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1.70 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.

 tollywood movies

2018 మలయాళం సినిమా తెలుగులో..: ఇక కేరళలో వరదల నేపథ్యంలో తెరపైకి వచ్చిన 2018 అనే సినిమా మలయాళం లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ ఈ సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అదే సినిమాను తెలుగు నిర్మాత బన్నీ వాసు 200 కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X