2014లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా ఇదే!
హైదరాబాద్: 2014లో హయ్యెస్ట్ కలెక్షన్ చేసిన సినిమా ఏదో లెక్క తేలిసింది. ఈ ఏడాది చివరల్లో వచ్చి పలు చిత్రాలను సినిమాలను వెనక్కి తోసింది. టాప్ 3 స్థానం దక్కించుకుంది అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పికె' చిత్రం. ఈ చిత్రం రూ. 236 కోట్లు వస్లూ చేసింది. గ్రాస్ కలెక్షన్ ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇపుడు చెబుతున్న లెక్కలు అన్ని పోను నిర్మాతలకు దక్కిన షేర్ వివరాలు.
షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్', సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' చిత్రాలు ‘పికె' ధాటికి వెనక్కి వెళ్లక తప్పలేదు. ‘పికె' చిత్రం పోస్టర్ విడుదల నుండే వివాదాల్లో నానుతూ వస్తోంది. ఇటీవల కూడా ఈ చిత్రంపై ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి.
ఆ వివాదాలు సినిమాకు మరింత కలిసొచ్చాయని చెప్పక తప్పదు. అమీర్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా నిర్మాతలు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో..

ధూమ్-3
అమీర్ ఖాన్ నటించిన ధూమ్-3 చిత్రం 2013 డిసెంబర్లో విడుదలై నిర్మాతకు రూ. 284.27 కోట్లు సమకరూర్చింది.

క్రిష్-3
హృతిక్ రోషన్ నటించిన 2013 నవంబర్లో విడుదలై నిర్మాతకు రూ. 244.92 కోట్లు సమకూర్చింది.

పికె
అమీర్ ఖాన్ ‘పికె' చిత్రం ఈ నెలలో విడుదలై ఇప్పటి వరకు రూ. 236.5 కోట్లు వసూలు చేసి ఇంకా రన్ అవుతోంది. న

కిక్
సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' చిత్రం ఈ సంవత్సరం జులైలో విడుదలై రూ. 231.85 కోట్లు వసూలు చేసింది.

చెన్నై ఎక్స్ ప్రెస్
షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ గతేడాది ఆగస్టులో విడుదలై రూ. 227 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











