ఐదు రిలీజులు..ఐదు ఫ్లాపులు (ట్రేడ్ టాక్)
ఈ మధ్య కాలం లేని విధంగా ఈ వారం ఐదు చిత్రాలు ప్రేక్షకుల తీర్పుని కోరుతూ వచ్చాయి. అయితే అయిదు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్స్ ని,ఎగ్జిబ్యూటర్స్ నీ,నమ్మి వెళ్ళిన ప్రేక్షకులని నీరసపరిచాయి. నాసిరకమైన కథ, కథనాలతో జుగుప్స కలిగించే విధంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈవారం రిలీజైన ఆ ఐదు చిత్రాలు చిత్రాలూ ఏమిటంటే...నిత్య పెళ్లికొడుకు, తిమ్మరాజు, ప్రేమలేఖరాశా, సూపర్ (ఉపేంద్ర చిత్రం), నిశ్శబ్ద విప్లవం. వీటిలో ముఖ్యంగా నిత్యపెళ్లికొడుకు చిత్రం బూతు సినిమాగా ముద్రను వేసుకుంది. ఇక ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇన్నాళ్లకు వెలుగు చూసిన 'ప్రేమలేఖరాశా" చిత్రం సైతం మరో చెత్తచిత్రంగానే మిగిలిపోయింది. అలీ నటించిన 'తిమ్మరాజు",సూపర్ , నిశ్శబ్ద విప్లవం చిత్రాలను పట్టించుకున్న ప్రేక్షుకుడే లేడు.వీటిలో నయనతార,ఉపేంద్ర కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కన్నడంలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా తెలుగు నేటివిటి మిస్సవటం దెబ్బగా మారింది. అలీ తిమ్మరాజు ...పరమ బోరు రాజుగా మిగిలాడు. గాడ్స్ మస్ట్ బి క్రేజి చిత్రం స్పూర్తితో వచ్చిన ఈ చిత్రం వెగటు తెప్పించింది.


Click it and Unblock the Notifications











