Box office Collections 7000 కోట్లతో కలెక్షన్ల సునామీ.. MI 7, Oppenheimer వసూళ్లను మించిన మూవీ ఎంటో తెలుసా?
హాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా అగ్ర నటులు, భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోటీ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాజిబుల్ 7, ఓప్పెన్‌హైమర్, బార్బీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అమీతుమీ అంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను అల్లాడిస్తున్నాయి. ఈ వారం ఈ మూడు సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించడమే కాకుండా నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ 7 పార్ట్ వన్ చిత్రం జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వారం రోజుల తర్వాత అంటే జూలై 21వ తేదీన ఓపెన్ హైమర్, బార్బీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇండియాలో మిషన్ ఇంపాజిబుల్ 7: ఇక మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా ఇండియాలో భారీ ఓపెన్సింగ్స్ సాధించింది. తొలి రోజు 12 కోట్లకుపైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ కలెక్షన్ల వేగం పెంచింది. 21వ రోజున కూడా 60 లక్షల వసూళ్లను సాధించింది. గత 21 రోజుల్లో ఇండియాలో ఈ చిత్రం 103 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. గత 21 రోజుల్లో ఇంగ్లీష్ వెర్షన్ 68 కోట్లు, హిందీ వెర్షన్ 33 కోట్లు, తమిళంలో 2 కోట్లు, తెలుగు వెర్షన్‌లో 2 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాజిబుల్ కలెక్షన్లు: ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఇండియాతోపాటు బ్రిటన్, యూరప్, ఇతర దేశాల్లో 2550 కోట్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాతో కలిపి ఈచి్తరం 3700 కోట్ల వసూళ్లను సాధించింది. టామ్ క్రూజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఓప్పెన్‌హైమర్ కలెక్షన్లు ఇండియాలో: ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఓప్పెన్‌హైమర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 12 రోజుల్లో సుమారు 100 కోట్లకు చేరువైంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 98 కోట్లు షేర్, 115 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ 87 కోట్లు రాబడితే.. హిందీ వెర్షన్ 11 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

వరల్డ్ వైడ్ ఓప్పెన్‌హైమర్ కలెక్షన్లు: ఓప్పెన్‌హైమర్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరప్, ఇతర దేశాలతో కలిపి మొత్తంగా 2000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అమెరికా, కెనడా దేశాలతో కలిపి ఈ చిత్రం 3600 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

బార్బీ మూవీ ఇండియాలో: హాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజైన బార్బీ చిత్రం ఇండియాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం గత 12 రోజుల్లో కేవలం 37 కోట్ల రూపాయల షేర్, 44 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే వసూలు చేసింది. మిషన్ ఇంపాజిబుల్ 7, ఓప్పెన్ హైమర్ ధాటికి తట్టుకోలేకపోయింది. కానీ ఇతర దేశాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ సునామీ సృష్టించింది.

బార్బీ మూవీ వైరల్డ్ వైడ్ కలెక్షన్లు: ప్రపంచ వ్యాప్తంగా బార్బీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే... ఇండియాతోపాటు ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం 3600 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం అమెరికా, కెనడాలతో కలిపి 6700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 7 వేల కోట్లకు చేరువైంది. ఓవర్సీస్, అమెరికాలో . మిషన్ ఇంపాజిబుల్ 7, ఓప్పెన్ హైమర్ చిత్రాల కలెక్షన్లను బార్బీ అధిగమించింది.


Click it and Unblock the Notifications











