'యువత' గెలుపు(ట్రేడ్ టాక్)

కలెక్షన్స్ పరంగా అయితే యువత ఓపినింగ్స్ సరిగా తెచ్చకోలేకపోయింది.మెల్లిగా మౌత్ టాక్ తెచ్చుకోవటం ప్లస్ గా మారుతోంది. ఇక బ్లేడ్ బాబ్జి,కొత్త బంగారు లోకం భాక్సాఫీస్ వద్ద తమ హవాను ఇప్పటికీ కొనసాగుస్తున్నాయి. కేక,వన్,హీరో చిత్రాలను అంతా మర్చిపోయారు.
అలాగే ఈ శుక్రవారం ఆవకాయ బిర్యాని,సూర్య సన్నాఫ్ కృష్ణ అనే డబ్బింగ్ చిత్రం రిలీజ్ అయ్యాయి. శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ తో వచ్చిన ఆవకాయ బిర్యాని కథ,కథనాలు మరి నీరసంగా ఉండటం మైనస్ గా మారాయని టాక్ వచ్చింద. అలాగే సూర్య సన్నాఫ్ కృష్ణ టీవీ సీరియల్ లాంటి బయోగ్రాఫిక్ కథతో సహన పరీక్షపెడుతోంది. దాంతో కొత్త బంగారు లోకం సినిమాకు ఈ వారం కూడా కలసి వచ్చినట్లయింది.


Click it and Unblock the Notifications











