twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యువత' గెలుపు(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Yuvatha
    ఈ వారం మూడు స్ట్రైయిట్ చిత్రాలు,ఒక డబ్బింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏకలవ్యుడు,యువత,విజయ్ ఐపియస్ స్ట్రైయిట్ చిత్రాలు కాగా,ప్రేమ డబ్బింగ్ సినిమా. అయితే వీటిల్లో యువతే బాగుందని టాక్ తెచ్చుకుంది. ఏకలవ్యుడు..సినిమా వంశి కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను సినిమాను మరింత నీరసంగా మార్చి చేసిన కథనం కాగా,విజయ్ ఐపియస్...పాత శ్రీహరి సినిమాలని తలపించింది. అలాగే ప్రేమ ఏ వర్గానికి చెందని అసలు రిలీజైందో లేదో తెలియని స్ధితిలో పడింది.

    కలెక్షన్స్ పరంగా అయితే యువత ఓపినింగ్స్ సరిగా తెచ్చకోలేకపోయింది.మెల్లిగా మౌత్ టాక్ తెచ్చుకోవటం ప్లస్ గా మారుతోంది. ఇక బ్లేడ్ బాబ్జి,కొత్త బంగారు లోకం భాక్సాఫీస్ వద్ద తమ హవాను ఇప్పటికీ కొనసాగుస్తున్నాయి. కేక,వన్,హీరో చిత్రాలను అంతా మర్చిపోయారు.

    అలాగే ఈ శుక్రవారం ఆవకాయ బిర్యాని,సూర్య సన్నాఫ్ కృష్ణ అనే డబ్బింగ్ చిత్రం రిలీజ్ అయ్యాయి. శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ తో వచ్చిన ఆవకాయ బిర్యాని కథ,కథనాలు మరి నీరసంగా ఉండటం మైనస్ గా మారాయని టాక్ వచ్చింద. అలాగే సూర్య సన్నాఫ్ కృష్ణ టీవీ సీరియల్ లాంటి బయోగ్రాఫిక్ కథతో సహన పరీక్షపెడుతోంది. దాంతో కొత్త బంగారు లోకం సినిమాకు ఈ వారం కూడా కలసి వచ్చినట్లయింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X