తగ్గని తొలిప్రేమ జోష్ .. దూసుకెళ్తున్న వరుణ్ కలెక్షన్ల గ్రాఫ్

By Rajababu

Recommended Video

Tholi Prema Collections Proved Everything

ఓవర్సీస్ మార్కెట్‌లో టాలీవుడ్ చిత్రాలు తొలిప్రేమ దుమ్మురేపుతున్నది. తొలి ప్రేమ ఒక మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఇక తొలిప్రేమ తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాలో ముఖ్యంగా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తుండటం విశేషం.

అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో భారీ కలెక్షన్లు

తొలిప్రేమ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రెండోవారంలోకి ప్రవేశించింది. రెండు వారాల్లో తొలిప్రేమ చిత్రం అమెరికాలో 6.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను చేసి వరుణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

అమెరికా కలెక్షన్లు ఇలా

అమెరికా కలెక్షన్లు ఇలా

తొలిప్రేమ చిత్రం రెండోవారంలో శుక్రవారం 39,068 డాలర్లు, శనివారం 68,648 డాలర్లు, ఆదివారం 53,403 డాలర్లు, సోమవారం 26,687 డాలర్లు వసూలు చేయడం గమనార్హం. ఈ చిత్రానికి అమెరికాలోని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం గమనార్హం.

 తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తొలిప్రేమ తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ల పరంగా సత్తా చాటుతున్నది. గత తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం 26.65 కోట్ల గ్రాస్, 16.2 కోట్ల షేర్ సాధించింది.

 ప్రాంతాల వారీగా కలెక్షన్లు

ప్రాంతాల వారీగా కలెక్షన్లు

ఈ చిత్రం నైజాంలో 6.20 కోట్ల షేర్ (10.80 కోట్ల గ్రాస్), వైజాగ్‌లో 2.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.38 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.06 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.24 కోట్లు, గుంటూరులో 1.31 కోట్లు, నెల్లూరులో 50 లక్షలు కలెక్షన్లను వసూలు చేసింది.

 కర్ణాటకలోనూ ఘనంగా

కర్ణాటకలోనూ ఘనంగా

సుమారు 23 కోట్లతో రూపొందిన తొలిప్రేమ చిత్రం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రం కర్ణాటకలోను మంచి కలెక్షన్లను సాధించింది. కర్ణాటకలో ఈ చిత్రం 1.2 కోట్లను వసూలు చేయడం గమనార్హం. అలాగే మిగితా రాష్ట్రాల్లో 90 లక్షలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X