twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thor Love and Thunder భారీ వసూళ్లు రాబడుతున్న మార్వెల్ మూవీ.. 4 రోజుల్లో రికార్డు కలెక్షన్లు

    |

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం థోర్: లవ్ అండ్ థండర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇండియాలో ఒకరోజు కంటే ముందే అంటే జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిన ఐదో హాలీవుడ్ సినిమాగా ఘనతను సాధించింది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    మార్వెల్ సినిమాటిక్ మూవీస్ వివరాలు

    మార్వెల్ సినిమాటిక్ మూవీస్ వివరాలు


    థోర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాల విషయానికి వస్తే.. 2011లో థోర్ చిత్రం రిలీజైంది. ఆ తర్వాత 2013లో థోర్: ది డార్క్ వరల్డ్, 2017లో థోర్: రంగ్నారోక్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా థోర్: లవ్ అండ్ థండర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థోర్: రంగ్నారోక్ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా లభించింది.

    ఒకరోజు ముందుగానే ఇండియాలో

    ఒకరోజు ముందుగానే ఇండియాలో


    థోర్: లవ్ అండ్ థండర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండియాలో మార్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని థోర్ చిత్రాన్ని ఒక రోజు ముందే థియేట్రికల్ రిలీజ్ చేశారు. తొలి రోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు రావడం విశేషంగా మారింది.

    ఐదో చిత్రంగా రికార్డు

    ఐదో చిత్రంగా రికార్డు


    థోర్: లవ్ అండ్ థండర్ చిత్రం దేశవ్యాప్తంగా భారీగా థియేట్రికల్ రిలీజైంది. గతంలో హాలీవుడ్ సినిమాలు అవెంజర్: ఎండ్ గేమ్, స్పైడర్ మ్యాన్: నో వే హోం, అవేంజర్: ఇన్ఫినిటీ వార్, డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో రిలీజైన ఐదో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

    టాప్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో

    టాప్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో


    ఇక థోర్: లవ్ అండ్ థండర్ సినిమా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా మరో ఘనతను సొంతం చేసుకొన్నది. తొలి రోజున ఈ చిత్రం 18.60 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో అవెంజర్స్: ఎండ్ గేమ్ 53.10 కోట్లు, స్పైడర్ మ్యాన్ 32.67 కోట్లు, అవెంజర్స్: ఇన్ఫినిటీవార్ 31.30 కోట్లు, డాక్టర్ స్టేంజ్ 27.5 కోట్లు వసూలు చేశాయి.

     4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

    4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?


    ఇక థోర్: లవ్ అండ్ థండర్ చిత్రం గత నాలుగు రోజుల్లో ఎక్సలెంట్ కలెక్షన్లను సాధించింది. తొలి రోజు సాధించిన కలెక్షన్లకు సమానంగా 3, 4 రోజుల్లో కూడా భారీ వసూలు సాధించింది. తొలి రోజున అంటే గురువారం 18.20 కోట్లు, శుక్రవారం 11.4 కోట్లు, శనివారం 16.8 కోట్లు, ఆదివారం 18.4 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ చిత్రం 64.80 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది.

    English summary
    Marvel cinematic universe film Thor Love and Thunder has released on July 7th. Here is the 4 days collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X