Thudarum Collections: 100 కోట్లకు చేరువగా మోహన్ లాల్ మూవీ.. 3 రోజుల్లో తుడరం మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్, హీరోయిన్ శోభన జంటగా నటించిన తాజా చిత్రం తుడరం. ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో, హీరోయిన్లు మోహన్ లాల్, శోభనతోపాటు మలయాళంలో టాలెంటెడ్ యాక్టర్లు నటించడం, ఈ సినిమాను ప్రొడక్షన్ పరంగా రిచ్‌గా, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ కూడా భారీగా అయింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు బడ్జెట్ సుమారుగా 90 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఫ్యామిలీ సెంటిమెంట్స్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ రూపొందిన ఈ సినిమాను దక్షిణాదిలో అన్ని భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమాకు సుమారుగా 45 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 46 కోట్ల రూపాయల షేర్, 92 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఏర్పడింది.
తుడరం ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 5.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో 25 కోట్ల నెట్, 50 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఇటీవల కాలంలో తుడరం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో నాలుగో సినిమాగా నిలిచింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో 24 కోట్ల రూపాయలకుపైగా, ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు, కన్నడలో 3.2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.35 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు, సాక్ నిల్క్ వెల్లడించింది. అయితే మొత్తంగా ఈ సినిమా 30 కోట్లకుపైగా నెట్ వసూళ్లను సాధించింది.
మోహన్ లాల్ నటించిన తుడరం సినిమాకు ఓవర్సీస్‌లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 3వ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 5 మిలియన్ డాలర్లు అంటే.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిల్క్, ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు. దాంతో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











