Thudarum Box Office: తుడరం కలెక్షన్ల సంచలనం.. మోహన్‌లాల్ బాక్సాఫీస్ రికార్డు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
మలయాళ చిత్రం తుడరం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. మోహన్ లాల్, హీరోయిన్ శోభన జంటగా నటించిన తాజా చిత్రానికి ఎం రంజిత్ నిర్మాతగా వ్యవహరించగా, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తుడరం బడ్జెట్
స్టార్ హీరో, హీరోయిన్లు మోహన్ లాల్, శోభనతోపాటు మలయాళంలో టాలెంటెడ్ యాక్టర్లు నటించడం, ఈ సినిమాను ప్రొడక్షన్ పరంగా రిచ్‌గా, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ కూడా భారీగా అయింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు బడ్జెట్ సుమారుగా 90 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

6 రోజులుగా రికార్డుల పర్వం
తుడరం చిత్రం మలయాళంలో సంచలన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు నుంచి గత 6 రోజులుగా రికార్డు స్థాయి కలెక్షన్లను, ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది. ప్రతీ రోజు ఈ మూవీకి 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషంగా మారింది. రిలీజ్ డే నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజు కనీసం 6 కోట్ల రూపాయలకు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తున్నది అని సాక్ నిల్క్ వెల్లడించింది.
కేరళ కలెక్షన్ల వివరాలు
ఇక మలయాళంలో తుడరం సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5.25 కోట్ల రూపాయలు, రెండో రెండోజు 8.5 కోట్లు, మూడో రోజు 10.3 కోట్లు, నాలుగో రోజు సోమవారం 7 కోట్ల రూపాయలు, ఐదో రోజు మంగళవారం 6.5 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తెలుగు, తమిళ, కన్నడ బాక్సాఫీస్
మోహన్ లాల్ నటించిన ఈ మూవీ కేరళేతర కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 4.5 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 11.25 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్‌లో తుడరం
ఇక ఓవర్సీస్‌లో తుడరం సినిమాకు మంచి స్పందన వ్యక్తమవుతున్నది. నార్త్ అమెరికా, మలేషియా, సింగపూర్, గల్ప్ కంట్రీస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు అంటే 5 రోజుల్లో 48 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
6వ రోజు మొత్తంగా ఎన్ని కోట్లంటే?
ఓవరాల్‌గా తుడరం ఇండియాలో వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో 37 కోట్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 11.25 కోట్లతో మొత్తంగా 48 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 48 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 6వ రోజున ఈ సినిమా 5 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరనున్నది.


Click it and Unblock the Notifications











