Thudarum Collections: మోహన్‌లాల్ మూవీకి రికార్డు కలెక్షన్లు.. తుడరం వసూళ్లు ఎన్ని కోట్లంటే?
మలయాళ స్టార్ హీరో, హీరోయిన్లు మోహన్ లాల్, శోభన జంటగా నటించిన తాజా చిత్రం తుడరుమ్. ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజైంది. ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
కేరళ నేటివిటి, విజువల్ బ్యూటీతో హ్యుమన్ ఎమోషన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ ఈ సినిమాతో రూపొందించారు. ఈ మూవీలో స్టార్ వాల్యూ, టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని రిచ్‌గా చిత్రీకరించారు. మోహన్ లాల్ రెమ్యునరేషన్ మినహాయించి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాను మోహన్ లాల్ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆశీర్వాద్ రిలీజ్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 45 కోట్లుగా వాల్యూ కట్టారు.

తుడరం మూవీ కేరళలో ఏప్రిల్ 25వ తేదీన, తెలుగులో ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయింది. అయితే కేరళలో ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్‌కు మాత్రమే కాకుండా కరెంట్ బుకింగ్‌కు రికార్డు స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి భారీ కలెక్షన్లు వసూలు నమోదు అయ్యాయి. మోహన్ లాల్ కెరీర్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించాయి.
మలయాళంలో తుడరం సినిమాకు భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కేరళలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా తొలి రోజున 5.25 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్‌లో సాధించిన రికార్డు వసూళ్లలో ఒకటిగా నిలిచింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగులో ఏప్రిల్ 25న పూర్తిస్థాయిలో రిలీజ్ కాలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ప్రాంతాల్లో రిలీజైంది. దాంతో ఈ సినిమా కేవలం 10 లక్షల రూపాయలు నెట్, 20 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొనే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తుడరం సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ మూవీకి గల్ఫ్, మలేషియా, సింగపూర్, యూకే, యూఎస్‌లో భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజున 1.25 మిలియన్ డాలర్లు అంటే 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ రిపోర్ట్. దాంతో ఈ సినిమా తొలి రోజున 18 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తుడరం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కూడా ఈ మూవీ స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ చిత్రం మొదటి రోజు సాధించిన దాని కంటే ఎక్కువగా మలయాళంలో రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా రెండో రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని వెల్లడించారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 30 కోట్లకుపైగానే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు, అలాగే సాక్ నిల్క్ రిపోర్టులు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











