నాని, సూర్యలకు మోహన్ లాల్ బిగ్ షాక్.. 24 గంటల్లో తుడరం రికార్డు
మోహన్ లాల్ ప్రస్తుతం 'తుడరం' అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికంటే ముందు ఎల్2 : ఎంపురాన్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన 'తుడరం' కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన శోభన హీరోయిన్ గా నటించింది. ఎం రంజిత్ నిర్మాతగా వ్యవహరించగా, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదలైన రెండో వారంలో సెన్సేషన్ గా ప్రీ బుక్కింగ్స్ ను నమోదు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం బడ్జెట్? కలెక్షన్స్? వంటి మిగితా వివరాల్లోకి వెళ్లితే..
తుడరం బడ్జెట్ ఎంత?
మోహన్ లాల్, శోభన వంటి స్టార్స్ నటించిన చిత్రం కావడం, మలయాళంలోని ప్రముఖ నటులు కూడా కీలక పాత్ర పోషించడం, సినిమాను గ్రాండ్ తెరకెక్కించడం వంటి అంశాలను భారీ ఖర్చును తెలియజేస్తున్నాయి. ప్రొడక్షన్ పరంగా, టెక్నిషియన్స్ పరంగా, ప్రమోషన్స్, తదితర ఖర్చులతో కలిపి మొత్తంగా రూ.90 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తుడరం 24 గంటల్లో క్రియేట్ చేసిన రికార్డు..
తుడరం చిత్రం ఏప్రిల్ 25న విడుదలైంది. ఆ వెంటనే మే1న నాని హిట్ 3, సూర్య రెట్రో, అజయ్ దేవగన్ రైడ్ 2 వంటి భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాలు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యాయి. ఈ చిత్రాల కంటే ఐదారు రోజుల ముందే 'తుడరం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే హిట్ 3, రెట్రో, రైడ్ 2 వంటి చిత్రాల ధాటికి ఈ సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని అనుకుంటే ఊహించని విధంగా భారీ పెరుగుతున్నాయి. కొత్త సినిమాలు వచ్చినా కేవలం మే3న 24 గంటల్లోనే 2 లక్షల 17 వేల టికెట్లు అమ్ముడుపోవడం షాకింగ్ గా మారింది. సూర్య, నాని టఫ్ ఫైట్ ఇస్తున్నా.. మోహన్ లాల్ సినిమాకు ఏమాత్రం ఇబ్బంది లేదనేలా ఈ బుక్కింగ్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఇండియా మొత్తంలోనే మే3న తుడరం చిత్రానికే హయ్యేస్ట్ బుక్కింగ్స్ రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో మోహన్ లాల్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది.
9రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన వసూళ్లు..
తుడురమ్ చిత్రం మే3 వరకు 9రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వసూళ్లు అదిరిపోయాయి. ఇప్పటి వరకు రూ.63 కోట్ల ఇండియా నెట్, రూ.73.25 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం రూ.71.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇలా ఓవర్సీస్ + ఇండియా వసూళ్లు మొత్తం కలిపి రూ.145 కోట్ల వరకు వసూళ్లు అందుకుందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి.
Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.


Click it and Unblock the Notifications











