Thug Life Advance Collections: థగ్ లైఫ్ బడ్జెట్ ఎంత? కమల్ హాసన్ మూవీ అడ్వాన్స్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. అంతేకాకుండా హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌ను అనుసరంచారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు కాగా, ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Thug Life Advance Booking Collections

ఇక ఓ పక్క కన్నడ భాషా వివాదం కొనసాగుతుండగా.. మరో పక్క ఆ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ ప్రచార కార్యక్రమాలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించగా.. భారీ ఆదరణ, స్పందన వ్యక్తమవుతున్నది. తమిళనాడు, గల్ఫ్, ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఇంకా రెండు రోజులు ఉండగానే... రికార్డు స్థాయి కలెక్షన్లు రిజిస్టర్ అవుతున్నాయి.

దక్షిణాదిలో ఈ సినిమాకు మధ్యస్థంగా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నది. ముఖ్యంగా తమిళనాడు క్రేజ్ ఎక్కువగా కనిపిస్తున్నది. దాంతో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది. తమిళనాడులో ఇప్పటికే 2 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు నమోదయ్యాయి.వివాదం కారణంగా కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ అనుమానాస్పదంగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా ఈ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అలాగే కేరళలో మంచి స్పందన లభిస్తున్నది.

థగ్ లైఫ్ సినిమా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. దక్షిణాదితోపాటు ఈ సినిమాకు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఉత్తర భారతంలో హిందీ వెర్షన్‌తో కలిపి ఈ సినిమాకు సుమారుగా 12 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు రాబట్టింది. ఇంకా రెండు రోజులు ఉన్నందున ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉంది.

ఇక గల్ఫ్, మలేషియా, సింగపూర్, ఇతర దేశాల్లో ఈ సినిమాకు మంచి ఆదరణ కనిపిస్తున్నది. గత 24 గంటల సమయంలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 8.8 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఒపెన్ కావాల్సి ఉంది. అలాగే కొన్ని దేశాల వసూళ్ల వివరాలు అందాల్సి ఉన్నవని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వివాదాలతో ముందుకు కొనసాగుతున్న థగ్ లైఫ్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమా ఇప్పటికే సుమారుగా 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. మరో 24గంటల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X