Thug Life Telugu Closing Collections: థగ్ లైఫ్ క్లోజింగ్ కలెక్షన్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల నష్టమంటే

లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించిన వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాను హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన బ్యానర్ శ్రేష్ట్ సినిమాపై డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాకు సుమారుగా 13 కోట్ల రూపాయలు అడ్వాన్సుగా చెల్లించారనేది ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కనీసం 13 కోట్ల షేర్ సాధిస్తే.. బ్రేక్ ఈవెన్ అయినట్టుగా, అలాగే ఇంకా ఎక్కువగా వసూలు చేస్తే లాభాలను సాధించినట్లవుతుందని అందరూ భావించారు. అలా భారీ అంచనాలతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

Thug Life Box Office Closing Collections I

కమల్ హాసన్, మణిరత్నం కాంబో 35 ఏళ్ల తర్వాత రిపీట్ కావడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ సినిమాను సుమారుగా 400 స్క్రీన్ల నుంచి 500 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలి ఆట తర్వాత ఊహించని టాక్ రావడం, నెగిటివ్‌గా ఈ సినిమాపై కామెంట్స్ వినిపించడంతో తొలి రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోవడం ప్రారంభించాయి. ఇక రెండో రోజు నుంచి క్రమేపీ క్షీణించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 50 లక్షల రూపాయలు, మూడో రోజు 50 లక్షల రూపాయలు, నాలుగో రోజు ఈ సినిమా 55 లక్షల రూపాయలు, ఐదో రోజు 30 లక్షల రూపాయలు, ఆరవ రోజు 30 లక్షల రూపాయలు, ఏడో రోజు 20 లక్షల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమామ 3.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్ల విషయానికి వస్తే.. థగ్ లైఫ్ చిత్రం రెండు రాష్ట్రాల్లోను వసూళ్లను భారీగా రాబట్టలేకపోయింది. ఈ సినిమాపై క్రిటిక్స్, ప్రేక్షకులు పెదవి విరవడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. నైజాంలో ఈ సినిమా 1.5 కోట్లు, ఆంధ్రాలో 1.6 కోట్లు, సీడెడ్‌లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. సుమారుగా 3.6 కోట్ల గ్రాస్.. 2 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా 13 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మొదలై సుమారుగా 2.5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఊహించని విధంగా అంటే.. సుమారుగా 10 కోట్లకుపైగానే నష్టాలతో ముగిసే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్‌గా మారింది అని మార్కెట్ పండితులు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X