కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఒక్కొక్కరికి రెమ్యునరేషన్లు ఎన్ని కోట్లో తెలుసా?
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత మళ్లీ అదే హైప్ తో 'థగ్ లైఫ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో 37 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కర్ణాటకలో వివాదం మొదలై సినిమాపై గట్టి ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా చిత్రంలో నటిస్తున్న స్టార్ కాస్ట్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
స్పెషల్ గా మణిరత్నం, కమల్ హాసన్ కాంబో..
థగ్ లైఫ్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటానికి మొదటి కారణం మణిరత్నం. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో దాదాపు నాలుగు దశాబ్దాలకు వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత వీరి కాంబినేషన్ లో 1987లో నాయకన్ అనే చిత్రం వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. కమల్ హాసన్ కెరీయర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవ్వడం విశేషం. ఆ చిత్రంలో కమల్ హాసన్, శరణ్య పొన్వన్నన్, కార్తీక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ప్రస్తుతం 'థగ్ లైఫ్'లోనూ భారీ తారాగణమే ఉండటం విశేషం.

థగ్ లైఫ్ చిత్రంలో భారీ తారాగణం..
కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ చిత్రం థగ్ లైఫ్ లో లీడింగ్ యాక్టర్స్ నటించిడం విశేషం. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా.. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా అభిరామి నటించడం విశేషం. ఇక కోలీవుడ్ స్టార్ సింబు కూడా ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జి, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 5, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
ఒక్కొక్కరికి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్..
థగ్ లైఫ్ చిత్రం కోసం కమల్ హాసన్ రూ.75 కోట్లు, త్రిష కృష్ణన్ రూ.12 కోట్లు, శింబు రూ.8 కోట్లు, పంకజ్ త్రిపాఠి రూ.2.5 కోట్లు, సాన్య మల్హోత్రా రూ. 1 కోటి, ఐశ్వర్య లక్ష్మి రూ.50 లక్షల పారితోషికం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
థగ్ లైఫ్ కర్ణాటక వివాదం..
థగ్ లైఫ్ విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ మాట జారారు. కన్నడ భాష తమిళ భాష నుంచే ఉద్భవించిందని అన్నారు. దాంతో కన్నడిగులు కన్నెరజేశారు. కమల్ హాసన్ మాటలను తప్పు బట్టుకున్నారు. థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య అక్కడ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











