Thug Life Day 1 Collections: థగ్ లైఫ్ కు రికార్డు ఓపెనింగ్స్.. కమల్ హాసన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించిన వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ విషయానికి వస్తే.. మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) పోలీసుల ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి అమర్ (శింబు) అనే బాలుడిని అడ్డుపెట్టుకొని పారిపోతాడు. అమర్ తండ్రి ఎన్‌కౌంటర్‌లోనే మరణించి అానాథ కావడమే కాకుండా చంద్ర అనే చెల్లెలికి దూరం అవుతాడు. అయితే తన చెల్లెల్లిని కల్పిస్తానని అమర్‌కు మాటిస్తాడు. కొన్ని పరిస్థితుల కారణంగా శక్తిరాజు జైలుకు వెళ్లాల్సి రావడంతో అమర్‌ను తన మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ప్రకటిస్తాడు. ఓసారి అధికారం రుచిని చూసిన తర్వాత అదే అధిపత్యాన్ని కొనసాగించాలని కుట్రపన్ని శక్తిరాజును చంపేందుకు ప్లాన్ చేస్తారు. కానీ అదృష్ణవశాత్తు శక్తిరాజు బతికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత మాఫియా గ్యాంగ్‌లో ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

థగ్ లైఫ్ సినిమాలో టాప్ ఆర్టిస్టులు, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లోకేషన్లలో షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 225 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో రికార్డు స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 600 స్క్రీన్లు, ఏపీ, తెలంగాణలో 400 స్క్రీన్లు, ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక థగ్ లైఫ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 7 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు అంటే 13 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా 24 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
థగ్ లైఫ్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఇక ఏపీ, నైజాంలో 5 కోట్ల రూపాయల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 2 నుంచి 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు మొత్తంగా 35 నుంచి 40 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తుంది అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











