Thug Life Day 2 Collections: డిజాస్టర్ టాక్‌లోను కుమ్మేసిన థగ్ లైఫ్.. కమల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించిన వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ బడ్డెట్
థగ్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లోకేషన్లలో షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 225 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎన్ని థియేటర్లలో రిలీజ్ అంటే?
థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో రికార్డు స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 600 స్క్రీన్లు, ఏపీ, తెలంగాణలో 400 స్క్రీన్లు, ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రా, నైజాంలో ఎన్ని కోట్లంటే?
థగ్ లైఫ్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ సినిమా 65 లక్షలు, ఆంధ్రాలో 75 లక్షలు, సీడెడ్‌లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.5 కోట్ల గ్రాస్, 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 11 కోట్ల రూపాయలుగా విలువ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల షేర్, 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో
తమిళనాడులో థగ్ లైఫ్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా నిలిచింది. తమిళనాడులో తొలి రోజు 15.5 కోట్ల రూపాయల నెట్, 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో నిషేధం విధించడంతో కలెక్షన్ల పరంగా దెబ్బ పడింది. కేరళలో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. హిందీ, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్, వరల్డ్ వైడ్
దాంతో ఇండియాలో ఈ చిత్రం 21 కోట్ల షేర్, 31.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.
2వ రోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?
ఇదిలా ఉండగా, రెండో రోజు థగ్ లైఫ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీపై పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా 2వ రోజు 8 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











