Thug Life Day 3 Collections: కమల్ హాసన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా.. థగ్ లైఫ్ నష్టాల్లోంచి బయటపడాలంటే?

లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించిన వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

థగ్ లైఫ్ బడ్డెట్
థగ్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లోకేషన్లలో షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 225 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Thug Life Movie Day 3 Box Office Collections

ఎన్ని థియేటర్లలో రిలీజ్ అంటే?
థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో రికార్డు స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 600 స్క్రీన్లు, ఏపీ, తెలంగాణలో 400 స్క్రీన్లు, ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రా, నైజాంలో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ 2 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 50 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో కలిపి 2 కోట్ల షేర్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది. ఇక మూడో రోజు ఈ సినిమా 50 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ సినిమా 13 కోట్ల షేర్, 26 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో
తమిళనాడులో ఈ సినిమా తొలి రోజు 13.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక మూడో రోజు ఈ సినిమా తమిళనాడులో 5.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక హిందీ ప్రాంతంలో వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా కనీసం ఒక కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

ఓవర్సీస్‌తోపాటు వరల్డ్ వైడ్ కలెక్షన్లు
థగ్ లైఫ్ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో కొంతలో కొంత బెటర్‌గా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 25.5 కోట్లు, తెలుగులో 4.5 కోట్లు, హిందీలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కేరళ బాక్సాఫీస్ వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 60 కోట్ల గ్రాస్ వసూళ్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 210 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా పరిస్థితి చూస్తే బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు నమోదు చేసే అవకాశం స్పస్టంగా కనిపిస్తుంది. కమల్ హాసన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా ఈ సినిమా మారబోతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X