Thug Life Day 5 Collections: థగ్ లైఫ్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్.. 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించిన వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ బడ్డెట్
థగ్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు, పాపులర్ టెక్నిషియన్స్ పనిచేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లోకేషన్లలో షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 225 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎన్ని థియేటర్లలో రిలీజ్ అంటే?
థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో రికార్డు స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 600 స్క్రీన్లు, ఏపీ, తెలంగాణలో 400 స్క్రీన్లు, ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తమిళనాడులో వసూళ్లు
కమల్ హాసన్ నటించిన ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద దారుణమైన జర్నీని కొనసాగిస్తున్నది. తొలి రోజు 13.5 కోట్లు, రెండో రోజు 6.5 కోట్లు, మూడో రోజు 7 కోట్లు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 40 లక్షలు, మూడో రోజు 35 లక్షలు, 4వ రోజు 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 80 లక్షలు, ఆంధ్రాలో 1 కోటి రూపాయలు, సీడెడ్‌లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో
ఇక థగ్ లైఫ్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 33 కోట్ల రూపాయలు, కేరళలో 2.5 కోట్లు, ఆంధ్రా, నైజాంలో 2 కోట్ల షేర్, 3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్లు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో సుమారుగా 5 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
5వ రోజు ఎంతంటే?
ఇక ఈ సినిమా 5వ రోజు మరో 5 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 90 కోట్ల వద్ద కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్ల వసూలు చేయాల్సి ఉంటుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ జర్నీ క్లోజ్ అయినట్టే అనే టాక్ వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











