For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’: ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్... నష్టం ఎంతో తెలుసా?

    |

    అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రం బాక్సాఫీసు వద్ద దెబ్బ మీద దెబ్బ తింటూ, భారీ నష్టాలు రుచి చూస్తూ అతికష్టం మీద వారం రోజులు పూర్తి చేసుకుంది. సోమవారం నుంచే థియేటర్లన్నీ ఖాళీగా దర్శమిస్తుండటంతో ఇప్పటికే చాలా థియేటర్లలో సినిమా ఎత్తేశారు.

    ఫస్ట్ షో నుంచే నెగెటివ్ రివ్యూలు, నెగెటివ్ మౌట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్ల పతనం మొదలైంది. బుధవారం వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ వీక్ నుంచి మాగ్జిమమ్ థియేటర్ల నుంచి ఎత్తేయడం ఖాయం అని తేలిపోయింది.

    వారంలో రోజుల్లో ఎంత వసూలైందంటే..

    వారంలో రోజుల్లో ఎంత వసూలైందంటే..

    భారీ అంచనాలతో విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' తొలి రోజు రూ. 50 కోట్లో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ... నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు సంగం కలెక్షన్లు డ్రాప్ అయ్యి రూ. 28 కోట్లకు పడిపోయింది. వారం రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో హిందీ, తమిళం, తెలుగు వెర్షన్ కలిపి రూ. 137.55 కోట్లు రాబట్టింది.

    7వ రోజు కేవలం రూ. 3.50 కోట్లు

    వారం రోజుల్లో... జరిగిన బిజినెస్ వివరాలు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హిందీ వెర్షన్ రూ. 132.5 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.

    గురువారం: రూ. 50.75 కోట్లు
    శుక్రవారం: రూ. 28.25 కోట్లు
    శనివారం: రూ. 22.75 కోట్లు
    ఆదివారం: రూ.17.25 కోట్లు
    సోమవారం: రూ. 5.50 కోట్లు
    మంగళవారం: రూ. 4.35 కోట్లు
    బుధవారం: రూ. 3.50 కోట్లు

    తెలుగు, తమిళంలో...

    తెలుగు, తమిళంలో వారం రోజుల్లో కలిపి రూ. 5.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గురువారం: రూ.1.50 కోట్లు, శుక్రవారం: రూ. 1 కోటి శనివారం: రూ. 75 లక్షలు, ఆదివారం: రూ. 75 లక్షలు, సోమవారం: రూ.50 లక్షలు, మంగళవారం: రూ. 40 లక్షలు, బుధవారం: రూ. 30 లక్షలు రాబట్టింది.

    బడ్జెట్ ఎంత? నష్టం ఎంత?

    బడ్జెట్ ఎంత? నష్టం ఎంత?

    ఈ సినిమా కోసం యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ దాదాపు రూ. 250 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటి వరకు కేవలం గ్రాస్ మాత్రమే రూ. 137 కోట్లు వసూలైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 70 నుంచి 80 కట్ల వరకు ఉంటుందని అంచనా. రూ. 150 కోట్ల నుంచి రూ. 180 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

    18 ఏళ్ల తర్వాత అమీర్ ఖాన్ అతిపెద్ద ప్లాప్

    18 ఏళ్ల తర్వాత అమీర్ ఖాన్ అతిపెద్ద ప్లాప్

    ఇక అమీర్ ఖాన్ దాదాపు 18 ఏళ్ల తర్వాత అతిపెద్ద ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో(2000 సం.) అమీర్ ఖాన్ నటించిన ‘మేలా' భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

    English summary
    Thugs of Hindostan 1st week box office collection stands at about Rs 137.55 crore with Rs 3.50 crore coming in on Wednesday. Thugs of Hindostan is a big budget multi-starrer and stars Amitabh Bachchan, Katrina Kaif and Fatima Sana Shaikh. While the makers called it a visual spectacle, the film was given a thumbs down by the critics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X