twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలితో పోటీ అన్నారు.. 2018లోనే బిగ్ షాక్.. దారుణంగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'!

    |

    మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఎలాంటి అంచనాలతో విడుదలైందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి రికార్డులు బద్దలు కొండుతుందంటూ అంచనా వేశారు. కానీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వసూళ్ల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. తొలివీకేండ్ పూర్తయ్యే సరికే ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్స్ ఖాళీగా మారిపోయాయి. సోమవారం వసూళ్లు గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది.

    సినిమా డిజాస్టర్ టాక్... ఫేక్ కలెక్షన్లతో నిర్మాతలు ప్రేక్షకులను మాయ చేస్తున్నారా?సినిమా డిజాస్టర్ టాక్... ఫేక్ కలెక్షన్లతో నిర్మాతలు ప్రేక్షకులను మాయ చేస్తున్నారా?

    ఐదురోజుల వసూళ్లు ఇలా

    ఐదురోజుల వసూళ్లు ఇలా

    థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విడుదలైన తొలిరోజు అంటే గురువారం 50.75 కోట్లు వాసులు చేసింది. శుక్రవారం 28, శనివారం 22, ఆదివారం 17 కోట్లు సాధించింది. ఇక సోమవారం పరిస్థితి దారుణంగా ఉండడంతో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం 2018 అతిపెద్ద డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. సోమవారం ఈ చిత్రం కేవలం 5 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం 124 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    తెలుగు, తమిళ భాషల్లో

    తెలుగు, తమిళ భాషల్లో

    తెలుగు, తమిళ భాషల్లో సోమవారానికి ఈ చిత్రాన్ని 4.5 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర వసూళ్లు 130 కోట్ల వరకు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 5000 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ చిత్ర వసూళ్ల డ్రాప్ ని వివరించారు.

     వసూళ్లు తగ్గుముఖం ఇలా

    వసూళ్లు తగ్గుముఖం ఇలా

    గురువారం రోజు 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్ర వసూళ్లు శుక్రవారం 44 శాతం డ్రాప్ అయినట్లు తరుణ్ అదుర్స్ తెలిపారు. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం రోజు 19 శాతం డ్రాప్, శనివారంతో పోల్చుకుంటే ఆదివారం 24 శాతం డ్రాప్, ఇక సోమవారం భారీ స్థాయిలో 68 శాతం డ్రాప్ కనిపించింది.

    ఎంతమంది ఉన్నా

    ఎంతమంది ఉన్నా

    ఈ చిత్రంలో అమిర్ ఖాన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్ ఇలా స్టార్స్ ఎంతమంది ఉన్నా దారుణమైన ప్లాప్ నుంచి కాపాడలేకపోయారు. విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకుడు. పీకే, దంగల్ తరహాలో అమిర్ ఖాన్ చిత్రాలు వైవిధ్యభరితంగా ఉంటాయని ఆశించిన వారికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం నిరాశనే మిగిల్చింది.

    English summary
    Thugs of Hindostan box office day 5: Aamir Khan, Amitabh Bachchan film crashes. total earning Rs 128 cr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X