దారుణంగా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వసూళ్లు.. రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..
Recommended Video

నెగిటివ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్ర కలెక్షన్లపై దారుణంగా ప్రభావం పడినట్టు కనిపిస్తున్నది. తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథ, కథనాలు పేలవంగా ఉండటంతో సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరచడం సినిమాకు ప్రతికూలంగా మారింది. రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

తొలిరోజు వసూళ్లు
దేశీయ బాక్సాఫీస్ వద్ద థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం తొలి రోజు రూ.50 కోట్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్‌లు భారీగా కావడంతో, 5000 థియేటర్లలో రిలీజ్ కావడం ఈ సినిమా వసూళ్లకు ఊతమిచ్చింది. అయితే ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో రెండో రోజు సగానికి సగం వసూళ్లు పడిపోయినట్టు సమాచారం.

రెండో రోజు కలెక్షన్లు
ఇక రెండో రోజు కలెక్షన్లు, ఆక్యుపెన్సీ తొలిరోజుతో పోల్చుకొంటే 50 శాతం పడిపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.

తీసిపడేసే కలెక్షన్లు కావని
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా రెండో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే అంత తీసిపడేసేవేమీ కాదు. కానీ కలెక్షన్లు పెద్ద మొత్తంలో పడిపోవడం సినిమాపై ప్రేక్షకుల ఆదరణ బాగాలేదనే విషయానికి అద్దంపడుతున్నది.

300 కోట్లతో థగ్స్ హిందూస్థాన్
ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ మూవీ బ్యానర్‌పై రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత ఆదిత్య చోప్రా థగ్స్ హిందూస్థాన్‌ను రూపొందించారు. ఈ మొత్తాన్ని రాబట్టాలంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్థిరంగా వసూళ్లను సాధించాలి. వారాంతంలో భారీగా వసూళ్లు ఉంటే కొంతలో కొంత ఈ సినిమా పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











