twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్‌కు చైనా ప్రేక్షకుల ఝలక్... అక్కడ కూడా అదే రిపీట్!

    |

    అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఇండియాలో పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయగా అక్కడ కూగా ప్రేక్షకుల నుంచి తిరస్కరణకు గురైంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ రూ. 335 కోట్లతో రూపొందిన ఈ చిత్రం భారీ నష్టాలు చవిచూసింది.

    అమీర్ ఖాన్ సినిమాలకు చైనాలో మంచి మార్కెట్ ఉంది. ఆయన గత చిత్రాలు దంగల్, సూపర్ సీక్రెట్ స్టార్ లాంటివి ఇండియా కంటే చైనాలోనే అత్యధిక వసూళ్లు సాధించాయి. అయితే 'థగ్స్ హిందూస్థాన్' చిత్రాన్ని గట్టెక్కించడంలో అమీర్ ఖాన్ ఇమేజ్ పని చేయలేదు.

    ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసిందంటే...

    ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసిందంటే...

    ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ... చైనాలో కూడా ఈ చిత్రానికి ఆదరణ లభించ లేదు. రూ. 32 కోట్లు మాత్రమే వసూలు చేసింది. శుక్రవారం $1.51 మిలియన్, శనివారం $1.56 మిలియన్, ఆదివారం $1.61 మిలియన్.... మొత్తంగా $4.71 మిలియన్(రూ. 32.93) కోట్లు మాత్రమే వసూలు చేసింది' అని తెలిపారు.

    అమీర్ ఖాన్ ‘దంగల్' సంచలన రికార్డ్

    అమీర్ ఖాన్ ‘దంగల్' సంచలన రికార్డ్

    అమీర్ ఖాన్ గత చిత్రాల వసూళ్లు పరిశీలిస్తే.... దంగల్ చిత్రం చైనాలో ఫస్ట్ వీకెండ్ $14 మిలియన్(రూ. 97 కోట్లు) రాబట్టగా... ఓవరల్ రన్‌లో రికార్డు స్థాయిలో రూ. 1400 కోట్లు వసూలు చేసింది. నాన్ ఇంగ్లీష్ విదేశీ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన 5వ చిత్రంగా రికార్డులకెక్కింది.

    ‘సీక్రెట్ సూపర్ స్టార్' చిన్న సినిమా పెద్ద విజయం

    ‘సీక్రెట్ సూపర్ స్టార్' చిన్న సినిమా పెద్ద విజయం

    అమీర్ ఖాన్ సపోర్టింగ్ రోల్ చేసిన చిన్న చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్'.... ఇండియాలో రూ. 64 కోట్లు రాబడితే, చైనాలో రూ. 860 కోట్లు వసూలు చేసింది. దీన్ని బట్టి అక్కడ అమీర్ ఖాన్ స్టార్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ‘థగ్స్' విసయంలో పని చేయని అమీర్ ఖాన్ ఇమేజ్

    ‘థగ్స్' విసయంలో పని చేయని అమీర్ ఖాన్ ఇమేజ్

    అమీర్ ఖాన్ స్టార్ ఇమేజ్, క్రేజ్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' విషయంలో పని చేయలేదు. చైనా వ్యాప్తంగా భారీగా ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పటికీ రూ. 32 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో డిజాస్టర్ అని తేలిపోయింది.

    English summary
    “Thugs of Hindostan faces rejection in China,” Taran wrote in a tweet Monday. According to trade analyst Taran Adarsh, the Rs 335 crore production - the biggest ever made in Bollywood - has made Rs 32 crore in China, the world’s second largest movie market and traditionally a lucrative territory for Aamir.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X