‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’: ప్లాప్ టాక్, అయినా ఓపెనింగ్స్ అదుర్స్... కారణం ఇదే!
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇండియన్ బాక్సాఫీస్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం 'దంగల్' భారతీయ చలనరిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. అలాంటి స్టార్ నటిస్తుండటం, అమితాబ్ లాంటి మెగాస్టార్ కూడా మెయిన్ లీడ్‌గా చేయడంతో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రల్లో నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోవడంలో విఫలమైంది. అయితే ముందు నుంచి హైప్ ఎక్కువగా ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే...
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఓపెనింగ్స్ అదరగొట్టింది. ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 40 కోట్లు అవసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటం వల్లే ఓపెనింగ్స్ ఈ స్థాయిలో వచ్చాయి.

‘దంగల్' రికార్డ్ బద్దలు... కారణం ఇదే
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'.... ఫస్ట్ డే దంగల్ రికార్డ్స్(రూ. 29.78 కోట్లు) బద్దలు కొట్టింది. కారణం ‘దంగల్' 5300 స్క్రీన్లలో ప్రదర్శితం అయితే, ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' 7000 స్క్రీన్లలో ప్రదర్శించారు.

టికెట్స్ రేట్లు పెంచడం కూడా కలిసొచ్చింది
‘దంగల్' విడుదల సమయంతో పోలిస్తే ‘థగ్స్ ఆఫ్ ఇందూస్తాన్' టికెట్ రేట్లు 10 శాతం పెంచారు. ఇంత భారీ మొత్తంలో ఓపెనింగ్స్ రావడానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. అయితే నెగెటివ్ రివ్యూలు, ప్లాప్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్ల జోరు మున్ముందు ఉండక పోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

ఈ మూడు వారాలే కీలకం
‘థగ్స్ ఆప్ హిందూస్తాన్' చిత్రానికి బాక్సీఫీసు వద్ద రికవరీ టైమ్ కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 29 రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ‘2.0' విడుదలవుతోంది. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి ‘థగ్స్' బిజినెస్ పూర్తిగా క్లోజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











