twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 5 కోట్లు కూడా రాలేదు... సగం షోలు లేపేశారు, దారుణమైన గతి!

    |

    Recommended Video

    Thugs of Hindustan Box Office Collections Drops

    అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పరిస్థితి బాక్సాఫీసు వద్ద రోజు రోజుకు దిగజారుతోంది. మంగళవారంతో 6 డేస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.... డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది.

    బాహుబలితో పోటీ అన్నారు.. 2018లోనే బిగ్ షాక్.. దారుణంగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'!బాహుబలితో పోటీ అన్నారు.. 2018లోనే బిగ్ షాక్.. దారుణంగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'!

    సినిమాకు చూడటానికి వచ్చే జనాలు కరువవ్వడంతో సోమవారమే పలు షోలు రద్దు చేశారు. మంగళవారం పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో మరో 50 శాతం షోలు ఎత్తి వేసినట్లు తెలుస్తోంది. కనీసం వారం కూడా తిరక్క ముందు బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన సినిమా ఇంత దారుణ పరాజయం పాలవ్వడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

    రూ. 5 కోట్లు కూడా వసూలు కాలేదు

    రూ. 5 కోట్లు కూడా వసూలు కాలేదు

    మంగళవారం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రం దేశ వ్యాప్తంగా రూ. 5 కోట్లు కూడా వసూలు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్లకు సంబంధించిన వివరాలు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

     హిందీ వెర్షన్ వసూళ్లు

    హిందీ వెర్షన్ వసూళ్లు

    హిందీ వెర్షన్ ... గురువారం రూ. 50.75 కోట్లు, శుక్రవారం రూ. 28.25 కోట్లు, శనివారం రూ. 22.75 కోట్లు, ఆదివారం రూ. 17.25 కోట్లు, సోమవారం రూ. రూ.5.50 కోట్లు, మంగళవారం రూ. 4.35 కోట్లు.... మోత్తం రూ. 128.85 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.

    తమిళ, తెలుగు వెర్షన్

    తెలుగు, తమిళం వర్షన్.... గురువారం రూ. 1.50 కోట్లు, శుక్రవారం రూ. 1 కోటి, శనివారం రూ. 75 లక్షలు, ఆదివారం రూ.75 లక్షలు, సోమవారం రూ. 50 లక్షలు, మంగళవారం రూ. 40 లక్షలు.... మొత్తం రూ. 4.90 కోట్లు వసూలు చేసింది.

    కుప్పకూలిన బిజినెస్

    ఈ సినిమా బిజినెస్ రోజు రోజుకు ఏ స్థాయిలో కుప్పకూలిందో.... పర్సంటేజ్‌లో తరణ్ ఆదర్శ్ వివరించా. సోమవారం అత్యంత దారుణంగా 68 శాతం బిజినెస్ డౌన్ అయింది.

    English summary
    Thugs of Hindustan witnessed a dreadful collection at the Indian box office on its sixth day. " HINDI:Thu 50.75 cr, Fri 28.25 cr, Sat 22.75 cr, Sun 17.25 cr, Mon 5.50 cr, Tue 4.35 cr. Total: ₹ 128.85 cr, TAMIL + TELUGU: Thu 1.50 cr, Fri 1 cr, Sat 75 lakhs, Sun 75 lakhs, Mon 50 lakhs, Tue 40 lakhs. Total: ₹ 4.90 crTotal: ₹ 133.75 cr India biz." taran adarsh tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X